Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ లో ధిక్కార స్వరాలు ….మరోసారి మైనంపల్లి సంచలన కామెంట్స్…!

బీఆర్ యస్ లో ధిక్కార స్వరాలు ….మరోసారి మైనంపల్లి సంచలన కామెంట్స్!
-మెదక్ లో తన కుమారుడు పోటీ చేయడం ఖాయమని వెల్లడి
-మల్కాజిగిరి పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తేలేదన్న బీఆర్ఎస్ లీడర్
-రెండు నియోజకవర్గాల ప్రజలతో మాట్లాడాకే భవిష్యత్ కార్యాచరణ అంటూ ప్రకటన

బీఆర్ యస్ లో అభ్యర్థుల ఎంపైక చాల సజావుగా జరిగిందని అనుకుంటున్న సమయంలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి…స్వయంగా సీఎం బీఆర్ యస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన లిస్ట్ పై కొంతమంది బహిరంగ విమర్శలు చేస్తుండగా మరికొంత మంది అదుముకోసం చూస్తున్నారు .. 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ….మరో 4 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడం చర్చ నియాంశంగా మారింది…కేసీఆర్ విడుదల చేసిన అభ్యర్థుల లిస్ట్ పై టికెట్ వస్తుందని ఆశించిన ఆశావహులు మండిపడుతున్నారు ..ప్రధానంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు , మంత్రి హరీష్ రావుపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు …హరీష్ రావు అంతు చూస్తానని , సిద్ధిపేట లో ఎలా గెలుస్తారో చూద్దామని ఊగిపోయారు .హనుమంతరావు విమర్శలపై విదేశాల్లో ఉన్న మంత్రి కేటీఆర్ ,ఎమ్మెల్సీ కవిత ,స్వయంగా కేసీఆర్ ఖండించారు…ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉలిక్కి పడ్డట్లుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్ని విమర్శలు చేసిన మైనంపల్లికి టికెట్ ప్రకటించడం ఏమిటనే సందేహాలు తలెత్తుతున్నాయి. అసలు బీఆర్ యస్ ఏమిజరుగుతుంది అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి…

తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంగళవారం మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ లో మైనంపల్లి రోహిత్ పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. రోహిత్ పోటీ విషయంలో మాటకు కట్టుబడి ఉన్నానని, మాట తప్పేదిలేదని పేర్కొన్నారు. అదేవిధంగా మల్కాజిగిరిలో తాను కూడా బరిలో ఉంటానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ ఇచ్చి, తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంపై మైనంపల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సోమవారం తిరుమల చేరుకున్న మైనంపల్లి.. మంగళవారం కూడా అక్కడే ఉండిపోయారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో మైనంపల్లి హన్మంతరావుకు చోటుదక్కింది. అయితే, మెదక్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే కేటాయించారు. దీనిపై మైనంపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్ లో పోటీ చేయాలా వద్దా అనేది తన కుమారుడు రోహిత్ నిర్ణయానికే వదిలేశానని సోమవారం సాయంత్రం వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం దీనిపై మరోమారు మాట్లాడుతూ.. మెదక్ లో రోహిత్ పోటీ చేస్తాడని స్పష్టం చేశారు.

Related posts

టీ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు!

Ram Narayana

పూర్తిగా మద్దతిస్తున్నాను…: మోదీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్

Ram Narayana

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment