Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అమిత్ షా పర్యటన వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి షాక్

అమిత్ షా పర్యటన వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి షాక్
బీఆర్ యస్ గూటికి బీజేపీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని
కోనేరు చిన్నిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ
సస్పెన్షన్ కు ముందే చిన్ని సీఎం తో సమావేశం
ఆయన పార్టీ వీడుతున్నారని తెలిసే సస్పెండ్ చేశారన్న చిన్ని అనుయాయులు

బీజేపీ అగ్రనేత ,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈనెల 27 ఖమ్మం రానున్నారు ..అందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది…ఇందుకోసమే ఇటీవల కేంద్రమంత్రి ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురపు కిషన్ రెడ్డి ఖమ్మం వచ్చి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు … ఖమ్మంలో పెట్టె సభాస్థలిని పరిశీలించారు . అమిత్ షా ఖమ్మం సభ లో ముఖ్యనేతలు చేరతారని చెప్పారు . చేరే నేతలు ఎవరోకాని ఉన్న నేతలను ఆ పార్టీ నిలుపుకోలేక పోతుంది.. కోనేరు చిన్ని తోపాటు మరికొందరు బీజేపీ నుంచి బీఆర్ యస్, కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతుంది. అమిత్ షా ఈనెల 27 న రాష్ట్రానికి రానున్న సందర్భంగా 22 ముఖ్యనేతలు బీజేపీలో చేరనున్నారని ఆపార్టీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల తెలిపారు .

ఈసమయంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది …ఆపార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని అలియాస్ సత్యనారాయణ ఆపార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైయ్యారు . ఆయన సోమవారం రాత్రి ప్రగతిభవనంలో సీఎం కేసీఆర్ ను కలిశారు . బీఆర్ యస్ చేరేందుకు తన సమ్మతిని తెలిపారు . కేసీఆర్ కూడా ఆయన భవిష్యత్ పై భరోసా ఇచ్చారు . ఈ సందర్భంగా ఆయన వెంట ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , తాతా మధులు ఉన్నారు .

Related posts

గోషామహల్ అభ్యర్థిని కేసీఆర్ ఎందుకు ప్రకటించలేదో చెప్పిన రాజాసింగ్!

Ram Narayana

రేవంత్ రెడ్డే సీఎం అని డీకే శివకుమార్ ఎక్కడా అనలేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Ram Narayana

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కంగ్రెస్ దే హవా: న్యూస్ ఎక్స్ సర్వే

Ram Narayana

Leave a Comment