Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

చంద్రయాన్ చారిత్రక విజయం చూసి నా జీవితం ధన్యమైంది: నరేంద్ర మోదీ

  • చంద్రయాన్-3 విజయాన్ని దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోదీ
  • విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన మరుక్షణంలో ప్రధానిలో వెల్లువెత్తిన హర్షం
  • ఇదో చారిత్రక క్షణమన్న ప్రధాని,
  • ఈ విజయం యావత్ మానవాళిదని వ్యాఖ్య

చంద్రయాన్-3 విజయంతో యావత్ భారతదేశం పులకించిపోయింది. దక్షిణాఫ్రికా నుంచి ఈ అద్భుత క్షణాలను వీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ అమితానందం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక క్షణాలు వీక్షించడంతో జన్మ ధన్యమైందని వ్యాఖ్యానించారు. 

ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే.. 
‘‘ఈ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేము. ఇవి అద్భుతమైన క్షణాలు.. ఇది భారత విజయ గర్జన.. సమస్యల మహాసముద్రాన్ని జయించిన క్షణం ఇది. చంద్రుడిపై విజయపు అడుగులు పడిన క్షణాలివి. 
కొత్త విశ్వాసం.. చైతన్యం.. ఉత్సాహంతో రాబోయే అద్భుత భవిష్యత్తుకు ఆహ్వానం పలుకుతున్న క్షణాలివి. మనం భూమిపై లక్ష్యాన్ని నిర్దేశించుకు చంద్రుడిపై సాధించాం. మన శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఇప్పుడు భారత్ చంద్రుడిపై కాలిడింది. నేడు మనం అంతరిక్షంలో భారత్ ప్రారంభించిన సరికొత్త ప్రయాణానికి సాక్ష్యంగా నిలిచాం. 

నేను ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలో ఉన్నాను. కానీ ఇతర భారతీయుల లాగే నా మనసంతా చంద్రయాన్ -3పై ఉంది. ఈ చారిత్రాత్మ ఘట్టం వీక్షించిన ప్రతిభారతీయుడు సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఇంట్లో ఉత్సాహం వెల్లి విరిసింది. నేను కూడా ఈ ఆనందోత్సాహాల్లో పాలు పంచుకుంటున్నాను. టీం చంద్రయాన్, ఇస్రో, భారతీయ శాస్త్రవేత్తలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈ క్షణం కోసం వాళ్లు ఏళ్ల పాటు పరిశ్రమించారు. ఈ క్షణం కోసం ఎదురు చూసిన 140 కోట్ల మంది దేశప్రజలకు వేనవేల శుభాకాంక్షలు. మన శాస్త్రవేత్తల శ్రమ, ప్రతిభ కారణంగా భారత్ చంద్రుడి దక్షిణ ధృవంపై చేరుకుంది.  మరే దేశమూ ఇప్పటివరకూ చేరుకోని ప్రాంతంలో కాలిడింది. 

నేటి నుంచి చంద్రుడికి సంబంధించిన కథలు, సామెతలు అన్నీ మారిపోతాయి. కొత్త తరానికి కొత్త సామెతలు వస్తాయి. ఈ విజయం కేవలం భారత్‌కు చెందినది కాదు. ప్రస్తుతం భారత్ జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తోంది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అన్న భారత దేశ విధానం ప్రపంచం నలుమూలలా మారుమోగుతోంది. మానవత్వపూరిత మా విధానాన్ని ప్రపంచమంతా స్వాగతిస్తోంది. చంద్రయాన్-3 మిషన్ కూడా ఈ ధృక్ఫథంతో కూడినది. కాబట్టి.. ఈ విజయం మానవాళిది. భవిష్యత్తులో ఇతర దేశాలు చంద్రుడిపై చేపట్టబోయే ప్రయోగాలకు చంద్రయాన్ విజయం సాయపడుతుంది.  ప్రతి దేశమూ ఇలాంటి ఫీట్ సాధించగలదన్న నమ్మకం నాకుంది.  మనందరం చంద్రుడితో పాటూ ఆపై లక్ష్యాలను కూడా సాకారం చేసుకోగలం. 

ఈ విజయం భారత పురుగోతిని మరింత ముందు తీసుకెళుతుంది. అనేక అద్భుత అవకాశాలను సాకారం చేసుకుంటాం. మనం ఇప్పటికే మరింత సమ్మున్నత లక్ష్యాలు పెట్టుకున్నాం. త్వరలోనే ఇస్రో ఆదిత్య ఎల్, గగన్ యాన్ మానవరహిత అంతరిక్ష ప్రయోగం కోసం ఏర్పాట్లు చేస్తోంది. విజయాలకు ఆకాశమమే హద్దు అని భారత్ పదే పదే నిరూపిస్తోంది. దేశ ఉజ్వల భవిష్యత్తుకు సైన్స్ అండ్ టెక్నాలజీనే ఆధారం. కాబట్టి, ఈ రోజు దేశప్రజలందరికీ శాశ్వతంగా గుర్తుండి పోతుంది. భవిష్యత్తుకు ప్రేరణగా నిలుస్తుంది. లక్ష్య సిద్ధికి దారి చూపిస్తుంది. వైఫల్యాన్ని  అధిగమించి విజయం ఎలా అందుకోవచ్చో నేర్పిస్తుంది. ఈ శుభక్షణాన.. మరొక్కసారి శాస్త్రవేత్తలు నా శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే మిషన్లు కూడా విజయవంతం కావాలని ఆశిస్తున్నా’’ అని ప్రధాని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. 

చంద్రయాన్-3 విజయవంతం కావాలని ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్: ఇస్రో చైర్మన్

  • దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు గర్వంగా ఉందని వ్యాఖ్య
  • శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారన్న చైర్మన్
  • ఇస్రో ఘనత.. ఇక ఎవరూ ఆపలేరని చంద్రబాబు
ISRO chairman thanks to all india people

చంద్రయాన్-3 విజయవంతం కావాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారని, ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధానికి ధన్యవాదాలు అన్నారు. మనం చంద్రయాన్-3ని విజయవంతంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ చేశామని, ఇప్పుడు జాబిలిపై భారత్ నిలిచిందన్నారు.

చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా అడుగుపెట్టి, ఈ ఘనత సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థగా ఇస్రో అవతరించిందని, ఇస్రో శాస్త్రవేత్తల అచంచల స్ఫూర్తికి, సంకల్పానికి వందనాలని, ఇది ఆరంభం మాత్రమే, ఇక ఎవరూ ఆపలేరని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. చంద్రయాన్ విజయవంతం కావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

చంద్రయాన్-3: శ్రీహరికోట కావడం మరింత ప్రత్యేకమంటూ జగన్ ట్వీట్

  • బిర్లా ప్లానిటోరియంలో చంద్రయాన్-3 ప్రయోగం వీక్షించిన తెలంగాణ గవర్నర్
  • చంద్రుడిపై భారత్ అంటూ బండి సంజయ్ 
  • చారిత్రక విజయమన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
Chandrayaan achieved from Sriharikota is much more special

చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 అడుగుపెట్టిన క్షణాలు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో వీక్షించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆదర్శ్ నగర్‌లోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో చంద్రయాన్-3 చారిత్రక ప్రయోగాన్ని వీక్షించినట్లు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేయగా తమిళిసై రీట్వీట్ చేశారు.

భారత్‌కు అపురూమైన విజయమని, చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు నేను, భారత ప్రజలు గర్విస్తున్నామని, ఇస్రోకు, అందరికీ నా శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ అపురూపమైన విజయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి అడుగుపడటం మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు.

ఇప్పుడు చంద్రుడిపై భారత్ అంటూ కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ ట్వీట్ చేశారు. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్, ఆవిష్కరణ అన్వేషణలో భారత్ అతిగొప్ప విజయం సాధించిందంటూ పేర్కొన్నారు. ఇది చారిత్రక విజయమని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు.

Related posts

భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నించిందా …?

Ram Narayana

ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్

Ram Narayana

58 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల టీనేజర్ అత్యాచారం..హత్య..

Drukpadam

Leave a Comment