Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ప్రజల సమస్యలని పట్టని కేంద్రం …దశలవారీ ఆందోళనలకు సిద్దమైన ప్రజాసంఘాలు…

కేంద్ర ప్రభుత్వ రైతు,కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై దశల వారీ ఆందోళనలు

  • విలేకరుల సమావేశంలో ఎఐఎడబ్లు యు ప్రధాన కార్యదర్శి బి వెంకట్, ఎఐకెయస్ జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్

సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త సదస్సు ఆగస్టు 24న ఢిల్లీలో తల్కతోరా స్టేడియంలో జరిగిన సందర్భంగా అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, అఖిలభారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్ విలేకరుల సమావేశంలో(తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ భవన్ ఢిల్లీ) మాట్లాడుతూ… కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కనీస మద్దతు ధరల చట్టం, రుణ విమోచన చట్టం చేయలేదని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించలేదని, 4గురు రైతులు ఒక విలేకరి మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆశిష్ కుమార్ మిశ్రా ను మంత్రివర్గం నుంచి తొలగించాలని, రైతాంగం పై అక్రమంగా బరాయించిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అనేక త్యాగాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 4 కార్మిక కోడ్లుగా మార్చిందని వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు .ఈ డిమాండ్లపై అక్టోబర్ 3వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 26 27 28 తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్రాల్లో మహా పడావులు నిర్వహించాలని తెలుపునిచ్చారు. డిసెంబర్, జనవరి మాసాల్లో దేశవ్యాప్తంగా బస్సు యాత్రలు, జీపు యాత్రలు, పాదయాత్రలు, సైకిల్ మోటార్ ర్యాలీలు, సభలు ,సమావేశాలు నిర్వహించి ప్రజా వ్యతిరేక నరేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇందులో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులతో పాటు ప్రజలందరూ భాగస్వాములు కావాలని విద్యావంతులు, మేధావులు ఈ పోరాటానికి అండగా నిలవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ డిమాండ్లతో పాటు కవులు రైతులకు 2011 చట్టం ప్రకారం రుణార్హత కార్డులు ఇవ్వాలని, అర్హులైన పోడు రైతులందరికీ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని, పంటలు నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలేని ఒక్క గ్రామమైన చూపగలరా

  • తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్

ముఖ్యమంత్రి కలెక్టర్ ఆఫీసులు ప్రారంభంచిన సందర్భంగా సభలలో భూ సమస్యలు పరిష్కరించేందుకు ధరణి తీసుకొచ్చామని అంటున్నారని కానీ రాష్ట్రంలో భూ సమస్య లేని ఒక్క గ్రామమైన చూపించగలరా అని ప్రశ్నించారు. సమగ్ర భూ సర్వే నిర్వహించి ధరణిలో ఉన్న లోపాలను సవరించాలని డిమాండ్ చేశారు.

రైతుల ను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
-ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని మోసం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి క్రుష్ణయ్య అన్నారు.
కనీస మద్దతు ధరలు లేక పోవడం వల్ల రైతాంగం నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.రాజధాని లేకపోవడంతో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనాధగా మారిందని, ప్రత్యేక హోదా లేక పోవడం వల్ల 9లక్షల కోట్లు ఆంధ్ర ప్రదేశ్ నష్టపోయిందని అన్నారు.
విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు కేశవ్ రావు, సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

173 ఫోన్లు ధ్వంసం చేశారు.. సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేసిన ఈడీ!

Ram Narayana

పూణె యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్!

Ram Narayana

కర్ణాటక ఫలితాలపై భారత్ జోడో యాత్ర ప్రభావం ఎంత?… జైరాం రమేశ్ విశ్లేషణ ఇదే!

Drukpadam

Leave a Comment