Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తమ సమస్యల పరిస్కారం కోసం వరంగల్ విద్యుత్తు సీఎండీ ఆఫీసు ముందు సి ఐ టి యూ ధర్నా….

తమ సమస్యల పరిస్కారం కోసం వరంగల్ విద్యుత్తు సీఎండీ ఆఫీసు ముందు సి ఐ టి యూ ధర్నా….
కనీస వెతలను అమలు జరపాలని డిమాండ్ …
విద్యుత్తు సంస్థలో పనిచేయుచున్న అన్ మ్యాన్ మీటర్ రీడర్లు, బిల్లు కలెక్టర్లు, పిఏఏ ,ఎస్ పి ఎం ,జె ఎల్ ఎం ,కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి .
కంపెనీ కార్యదర్శి ఎం ప్రసాద్

ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో వరంగల్ ఎన్పీడీసీఎల్ సిఎండి ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా పబ్లిక్ గార్డెన్ నుండి వందలాదిగా అన్ మాన్ కార్మికులు ,మీటర్ రీడర్లు బిల్ కలెక్టర్లు ,ఎస్ పి ఎం స్టోర్ ,కార్మికులు ర్యాలీగా బయలుదేరి వచ్చినారు. ఎన్పీడీసీఎల్ గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కార్డులు ప్రదర్శించినారు వచ్చిన కార్మికులని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు కే ఈశ్వర్ రావు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో అనేక సంవత్సరాలుగా ఉన్న అన్మాన్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని. హైస్కిల్ వేతనాలు ఇవ్వాలని, అనేక సంవత్సరాలుగా పనిచేయుచున్న మీటర్ రీడర్లు ,బిల్ కలెక్టర్లు, పీసు రేట్ కార్మికుల కనీస వేతనాలు జీవో నెంబర్ 11 ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేశారు

సంస్థలో ఆర్టిజన్లుగా గుర్తించే ముందుగా వీరు కూడా ఉన్నారని కేవలం ఈపీఎఫ్ సౌకర్యం లేకపోవడం చేత వీరిని ఆరోజు ఆర్టిజన్లుగా చేయలేదని వీరు కింది స్థాయిలో అత్యంత కష్టపడి పనిచేసే వారిగా ఉన్నారని మీరు కింది స్థాయిలో పనిచేయుచున్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనేకమంది విద్యుత్తు యాక్సిడెంట్ లో చనిపోతున్నారని కనీసం వీరికి ఎక్స్గ్రేషియా గాని వీరు చనిపోతే కనీసం వీరికి ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరని తెలియజేశారు .కావున యాజమాన్యం వీరికి ఇకనైనా ఆర్టిజన్లుగా గుర్తించాలని కనీస వేతనాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు .అనంతరం ఇన్చార్జి సిఎండి బి వెంకటేశ్వర గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినారు. వారితో ఈ సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలని కోరినారు.

గేటు ముందు జరిగిన సభకు కొలగాని రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వరంగల్ సిఐటియు నాయకులు జి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారికి స్వాగతం తెలియజేస్తూ కార్మికుల సమస్యల కోసం ఐక్యతతో నిరంతరం పోరాటాలు చేయాలని తెలియజేసినారు. ఈ యొక్క ధర్నా ఉద్దేశాన్ని తెలియజేసినారు
బిల్ కలెక్టర్ల తరఫున రాజేశ్వరి మాట్లాడినారు తమ కు కనీస వేతనాలు రావడం లేదని సెలవులు కూడా లేకుండా పనిచేస్తున్నట్లు, కనీస వేతనాలు లేవని, జీవితం చాలా దుర్భరంగా నడుస్తున్నదని కుటుంబాలు చాలా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసినారు. అనుమేన్ కార్మికుల తరఫున రవి మాట్లాడుతూ డిపార్ట్మెంట్లో కిందిస్థాయి పనిచేసే వారికి ఆర్టిజన్లుగా గుర్తించాలని, ఎక్కువగా శ్రమ పడేది తామేనని తన ఆవేదన వ్యక్తం చేసినారు. ఎక్కువ ఆక్సిడెంట్ లో చనిపోతున్నట్లు చనిపోయిన వారికి ఎలాంటి భద్రత లేదని తెలియజేసినారు
.
కంపెనీ కార్యదర్శి ఎం.ప్రసాద్ మాట్లాడుతూ పి.ఆర్.సి సమయంలో అన్ని యూనియన్ లు మీటర్ రీడర్లు బిల్ కలెక్టర్లు అనుమాన్ కార్మికుల ఊసే లేకపోవడం ఇటు యూనియన్లు మేనేజ్మెంట్ చాలా నిర్లక్ష్యం వహించినారని కనీసం పిఆర్సి సమయంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశించామని న్యాయం జరగకపోగా అన్యాయం జరిగిందని తెలియజేశారు.
రాష్ట్ర అధ్యక్షుడు కే. ఈశ్వరరావు మాట్లాడుతూ ఆర్టిజన్లుగా కొంతమందిని గుర్తించే నాటికి వీరు ఉన్నారని ఆరోజు కొంతమంది అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన వీరందరూ ఆర్టిజన్లు కాలేదని కాబట్టి ఇకనైనా వీరిని ఆర్టిజన్లుగా గుర్తించాలని, పైస్కిల్ వేతనం ఇవ్వాలని చనిపోయిన కార్మికులకు 10 లక్షలు ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో అవసరమైతేహైదరాబాద్ ట్రాన్స్కో వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినట్లు ఆయన గారు పేర్కొన్నారు కార్మికులంతా ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు యాజమాన్యం మానవత దృక్పథం వీరి సమస్యల పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా కోరినారు.

Related posts

ఉగాది రోజున వెంకటేశ్వరస్వామి ఆలయానికి ముస్లింలు… ఎందుకంటే..!

Drukpadam

పేపర్ లీక్ దుమారం: టీఎస్ పీఎస్సీ ఆఫీస్ వద్ద రణరంగం!

Drukpadam

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల గోల …15 స్థానాలకు ఎన్నికలు !

Drukpadam

Leave a Comment