ఖమ్మం జిల్లాలో తుమ్మల భారీ బలప్రదర్శనకు ఏర్పాట్లు … 1000 కార్లతో ర్యాలీ
శుక్రవారం ఖమ్మం రానున్న తుమ్మలకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
నాయకునిగూడెం నుంచి ఖమ్మం వరకు భారీ ర్యాలీ
కేసీఆర్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తుమ్మల
పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల
అది రాకపోవడంతో పాలేరుతో పటు వివిధ నియోజకర్గాల్లో తుమ్మల అనుయాయిల సమావేశాలు
రాయబారాలు బుజ్జగింపులపై తుమ్మల అసహనం …
పార్టీలో కనీస గౌరవమర్యాదలు లేకపోవడంపై ఆగ్రహం
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ అడుగులపై నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాపితంగా ఆసక్తి నెలకొన్నది … బీఆర్ యస్ నుంచి పాలేరు టికెట్ ఆశించి రాకపోవడంతో రగిలి పోతున్నారు … తనరాజకీయ జీవితంపై తాడో …పేడో తేల్చుకునేందుకు తుమ్మల సిద్దపడుతున్నారు … ఆయన కాంగ్రెసులోకి వెళుతున్నారని కొందరు …లేదు లేదు …బీజేపీలోకి వెళుతున్నారని కొందరు అంటున్న ఆయన నుంచి ఎలాంటి సంకేతాలు ఇంతవరకు లేవు …పాలేరులేదా ఖమ్మం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని అనుయాయిలు ఆయనపై తీవ్ర వత్తడి తెస్తున్నారు … కాంగ్రెస్ లో చేరాలని బలంగా ఆయన హితులు సన్నిహితులు కోరుతున్నారు … కాంగ్రెస్ , బీజేపీ నాయకులూ ఆయనతో టచ్ లోకి వచ్చారు …. రెండు మూడు రోజుల్లో రెండు పార్టీలకు చెందినవారు దమ్మపేట మండలంలోని ఆయన స్వగ్రామం గండుగులపల్లికి రానున్నట్లు సమాచారం….ఆయన రాజకీయ నిర్ణయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. అయితే ఏ పార్టీలో చేరిన సహచరుల కోరిక మేరకే జరుగుతుందని విశ్వసనీయ సమాచారం .. శుక్రవారం ఖమ్మం వస్తున్నా ఆయనకు నాయకంగూడెం టోల్ ప్లాజా వద్ద 1000 కార్లతో ఘన స్వాగతం పలికి ఖమ్మం వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు ..
40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న తుమ్మల రాష్ట్ర మంత్రిగా , ఎమ్మెల్యేగా జిల్లాకు సేవలు చేశారు . కొన్ని సార్లు ఓటమి చవి చూసినప్పటికీ ప్రజాజీవితంలో ఆయనకు మంచి పేరు ఉంది. జిల్లా అభివృద్ధి ప్రదాతగా ఆయనకు బిరుదు ఉంది…నాడు ఎన్టీఆర్ స్పూర్తితో టీడీపీలో చేరిన తుమ్మల ఆయన మంత్రి వర్గంలో మంత్రి అయ్యారు . తరవాత చంద్రబాబు హయాంలో కూడా భారీ నీటిపారుదల రోడ్లు భవనాలు లాంటి ముఖ్యమైన శాఖలు నిర్వహించారు . జిల్లాను 3 దశాబ్దాలకు పైగా శాసించారు . పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా పార్టీలో ఆయన మాటకు తిరుగు లేదు … జిల్లాలో అనేక మందికి టికెట్స్ కేటాయించడం లో ఆయన మాటకు తిరుగులేదు … కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది… ఆయనకు టికెట్ కోసం దేహి అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది….ఆయన స్వభావానికి ఆలా అడగటం విరుద్ధం …2023 ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇస్తాడని నమ్మకంతో ఉన్న తుమ్మలకు టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ ప్రభావానికి గురిచేయడం తట్టుకోలేక పోతున్నారు . తన రాజకీయ జీవితానికి ఘనమైన ముగింపు ఇవ్వాలని అనుకున్న తుమ్మలకు జరిగిన పరాభవంపై అనుయాయిలు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ టీడీపీ ఉనికి ప్రస్నార్ధకం కావడంతో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ యస్ లో చేరారు …మొదట కేసీఆర్ కూడా తుమ్మలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ముఖ్యమైన రోడ్ల భవనాల శాఖను అప్పగించారు . తర్వాత 2015 లో జరిగిన పాలేరు ఉపఎన్నికల్లో పోటీచేసి ఘన విజయం సంధించారు . తిరిగి 2018 లో పాలేరు నుంచి టికెట్ పొందిన తుమ్మల మంత్రిగా ఉండి అనూహ్య రీతిలో ఓడిపోయారు … దానికి కారణం తెలిసినప్పటికీ సీఎం కేసీఆర్ తుమ్మలను పక్కన పెట్టారు .
అనేక సార్లు కేసీఆర్ ను కలవాలని అనుకున్న టైం ఇవ్వలేదు …చివరకు ఖమ్మం లో జరిగిన సభాసందర్భంగా దగ్గరగా తీసుకున్నప్పటికీ టికెట్ ఇవ్వకపోవడంపై జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు జరిగే అవకాశాలు ఉన్నాయి…..