Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ఎస్‌కు కృష్ణయాదవ్ రాజీనామా, నాలుగైదు రోజుల్లో కీలక ప్రకటన!

  • కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా నిరాశకు గురి చేసిందన్న మాజీ మంత్రి
  • 2018 నుంచి పార్టీలో ఉన్నప్పటికీ తనకు ప్రాధాన్యత లేదని ఆవేదన
  • బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీ అని ఆరోపణ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కృష్ణయాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాజీనామాను ప్రకటించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా తనను తీవ్రంగా నిరాశకు గురి చేసిందన్నారు. 2018 నుంచి పార్టీలో ఉన్నప్పటికీ తనకు ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం లేని పార్టీలో కొనసాగడం ఇష్టంలేక రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. పెత్తందారులకు, భూస్వాములకే పార్టీలో ప్రాధాన్యత ఉందని, సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత కనిపించలేదన్నారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.కేశవరావు…

Ram Narayana

కేసీఆర్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసికెళ్లాలి…ఎంపీ నామ

Ram Narayana

బీఆర్ఎస్ తప్పులపై 100 అంశాలతో బీజేపీ ఛార్జ్ షీట్!

Ram Narayana

Leave a Comment