కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు ఖమ్మం వర్తకుల వినతి
ముడి పత్తికి జీఎస్టీ ఖరీదు మీద కట్టించుకోవాలని
అమ్మకమీద అడ్జెస్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి
సానుకూలంగా స్పదించిన అమిత్ షా
పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ
ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షులు మేళ్లచెరువు ఆధ్వరంలో అమిత్ షా కు కలిసిన వర్తకులు ..
ఖమ్మం వర్తకసంఘం ఆధ్వరంలో నేడు ఖమ్మం వచ్చిన అమిత్ షా ను కలిశారు . ఖమ్మం లో ముడి పత్తికి జీఎస్టీని ఖరీదు మీద కట్టించుకొని , అమ్మకంమీద అడ్జెస్ట్ చేసుకోవాలని వారు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు .2017 జులై జీఎస్టీ ఆర్ సి ఎం విధానం ఉంది .ఖమ్మం మార్కెట్ కు ప్రతి సంవత్సరం 5 లక్షల క్వింటాల్ పైగా పత్తి వస్తుంది..
ఈ 5 లక్షల క్వింటాల్ కు ఖరీదు దారు దగ్గర తీసుకున్న గెస్ట్ అమ్మకం దారు దగ్గర అడ్జెస్ట్ చేయాలి అదిజరగటంలేదు ..ఇది సాంకేతిక పరమైన తప్పిదంగా వర్తకులు అమిత్ షాకు వివరించారు … వారి మాటలను సావధానంగా విన్న అమిత్ షా వారి వద్ద నుంచి విజ్ఞాపన పత్రం అందుకొని తప్పకుండ తాను మాట్లాడతానని సానుకూలంగా స్పందించారు …అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు …అమిత్ షా స్పందించిన తీరు పట్ల వర్తకసంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు . తాము ఆయన స్పందన ఎలా ఉంటుందో అసలు తమ సమస్యను వింటారో లేదో అనుకున్నామని కానీ అమిత్ షా చాల శ్రద్దగా విని సమస్య అర్ధం చేసుకున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షులు మేళ్ల చెరువు వెంకటేశ్వరరావు తెలిపారు … కేంద్ర మంత్రిని కలిసిన వారిలో మేళ్లచెరువుతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు నల్లమల ఆనంద్ లు ఉన్నారు ..