దరఖాస్తుల వడపోతలో పీసీసీ ఎన్నికల కమిటీ తలమునకలు
నియోజకవర్గాలు 119 వచ్చిన దరఖాస్తులు 1000 పైనే
ఒక్క నియోజకవర్గానికి సరాసరి 8 దరఖాస్తులు
ప్రారంభమైన దరఖాస్తుల పరిశీలన
చివరికి నియోజకవర్గానికి ముగ్గురిని ఎంపిక చేసే అవకాశం
మూడు పేర్లు ఏఐసీసీ పరిశీలనకు
తెలంగాణ లో ఇప్పటికే బీఆర్ యస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకొని పోతుండగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలుగా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా వడపోసే కార్యక్రమంలో నిమగ్నమైంది..మంగళవారం సాయంత్రం గాంధీ భవనంలో సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల స్క్రినింగ్ కమిటీ సభ్యులు సమావేశమైయ్యారు…తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ నుంచి పోటీచేస్తామని దరఖాస్తు చేసిన వారిసంఖ్య 1054 మంది ఉన్నారు …వారిలో వచ్చిన దరఖాస్తులు పరిశీలించి వడపోసి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున పేర్లను ఫైనల్ చేసి ఏఐసీసీ స్క్రినింగ్ కమిటీకి పంపనున్నట్లు సమాచారం .అక్కడ వారు వాటిని పరిశీలించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కరిని సెలక్ట్ చేసి సీటు రానివారిని బుజ్జగించి అందరు కలిసి పనిచేసి కాంగ్రెస్ అధికారంలోకి తెలవాలని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు .అలకలు ,పార్టీ మారడం లాంటి సన్నివేశాలు సహజంగా జరుగుతాయి…అయితే ఒక్కొక్క నియోజకవర్గానికి సరాసరి 8 కి పైగా దరఖాస్తులు వచ్చాయి..దీంతో పోటీ ఎక్కువగానే ఉంది.. బీసీలకు పెద్ద పీఠ వేయాలనే డిమాండ్ ముందుకు వస్తున్న నేపథ్యంలో ఎవరిని ఏవిధంగా సంతృప్తి పరుస్తారనేది చూడాల్సిందే ….!