Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం కాంగ్రెస్ కు బలమైన నేతలు …అదే వారి బలహీనత అవుతుందా…?

ఖమ్మం కాంగ్రెస్ లో కొత్త చిక్కు …ఆ ఇద్దరు చేరితే ఐదుగురు కీలక నేతలు ..
తుమ్మల చేరిక దాదాపు ఖరారు … వేచి చూసే ధోరణిలో జలగం
ఇప్పటికే భట్టి ,రేణుకాచౌదరి , పొంగులేటి
పాలేరు తుమ్మల , పొంగులేటి ఖమ్మం , జలగం కొత్తగూడెం అని ప్రచారం ..
పార్లమెంట్ కు రేణుకాచౌదరి … ప్రయత్నాల్లో విహెచ్

కాంగ్రెస్ పని అయిపొయింది ..ఆపార్టీకి దిక్కు దివాణం లేదు …అని ప్రచారం జరుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా ఖమ్మంజిల్లా కాంగ్రెస్ కు కొత్త చిక్కు వచ్చిపడింది. ఇప్పటికే ఇద్దరు బలమైన నేతలు ఉండగా ఇటీవల పొంగులేటి భారీ బహిరంగసభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు .దీంతో ముగ్గురు నేతలు జిల్లాలో చక్రం తిప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు .తాజా రాజకీయ నేపథ్యంలో పాలేరు బీఆర్ యస్ టికెట్ ఆశించిన మాజీమంత్రి తుమ్మలకు టికెట్ ఇవ్వలేదు సరికదా కనీసం ఆయన అభిప్రాయాన్ని కూడా అడగలేదు …తనకు కచ్చితంగా కేసీఆర్ టికెట్ ఇస్తాడని నమ్మకంతో ఉన్న తుమ్మలకు పరాభవం ఎదురైంది.దీంతో ఆయన్ను పార్టీ పొమ్మనలేక పొయ్యిపెట్టినట్లు అయింది… తప్పని పరిస్థితుల్లో తుమ్మల తనదారి తాను చూసుకోకతప్పలేదు … పాలేరు నుంచి పోటీచేసి తన సత్తా చాటాలని గట్టిపట్టుదలతో ఉన్న తుమ్మలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది..ఫలితంగా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైయ్యారు . ఆయన సెప్టెంబర్ 6 లేదా 9 తేదీల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతుంది.దాన్ని తుమ్మల వర్గీయులు ఖండించడంలేదు ..పైగాతేదీ ఏదైనా ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమని అంటున్నారు . పాలేరు సీటు గ్యారంటీతో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారని విశ్వసనీయ సమాచారం …కాకపోతే ఖమ్మం నుంచి కూడా పోటీలో దిగితే బాగుంటుందని కొందరు కోరుతున్నారు ..ఏదైనా తప్పని సరి పరిస్థితుల్లో మార్పులు జరిగితే తప్ప పాలేరు నుంచి తుమ్మల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయడం ఖాయమని అంటున్నారు .ఇదే జరిగితే పాలేరు రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి.

ఇక కొత్తగూడెం బీఆర్ యస్ టికెట్ ఆశించిన జలగం వెంకట్రావు కు కూడా భగంపాటు తప్పలేదు..ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా వనమా ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందున ఆయన ఎన్నిక రద్దు చేసి జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా ప్రకటించింది..అయితే ఆయన సుప్రీం కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు …ఆసందర్భంగా జలగం ను బీఆర్ యస్ పట్టించుకోలేవు …వనమాకు సపోర్ట్ చేయడమేకాకుండా ఆయనకే తిరిగి టికెట్ ఇవ్వడంపై జలగం రగిలి పోతున్నారు .అందువల్ల కొత్తగూడెం నుంచి పోటీచేసేందుకు పావులు కదుపుతున్నారు .అయితే ఆయనకు రెండు మార్గాలు ఉన్నాయి.ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ …బీజేపీకి జిల్లాలో బలం లేనందున ఆపార్టీలోకి వెళ్లడం సందేహమే …ఇక టికెట్ ఇచ్చి కాంగ్రెస్ లోకి వస్తే పోటీ రసవత్తరంగా మారుతుంది… జలగం వస్తే పొంగులేటి ఖమ్మం నుంచి అనివార్యంగా పోటీచేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది….అదే జరిగితే జిల్లాలో లో పోరు భీకరంగా ఉండే అవకాశం ఉంది…

ఇంతవరకు బాగానే ఉన్న ఇక్కడేఉంది కొత్త చిక్కు ..తుమ్మల ,జలగం కాంగ్రెస్ లోకి వస్తే ఐదుగురు నేతల మధ్య సఖ్యత సందేహమే … అదే వారి బలహీనతగా మారే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు పరిశీలకులు … అందరు అందరే పైగా భట్టి సీఎం సీటు ఆశిస్తుండగా ,తుమ్మల సీనియర్ గా మంత్రిపదవి ఆశిస్తారు .పైగా ఆసామాజికవర్గం నుంచి ఆయనకే అవకాశం ఉంటుంది ..ఇక పొంగులేటి ,జలగం కూడా మంత్రి పదవులు ఆశిస్తారు ..అది తీర్చడం జరిగే పనికాదు …అసలు ముగ్గురు ఒక పార్టీ నుంచి పోటీచేస్తే ఆ ఊపు వేరే ఉంటుందని పరిశీలకుల అభిప్రాయం …ఎన్నికల యుద్ధం రణరంగాన్ని తలపిస్తుంది …ఇక రేణుకాచౌదరి ఖమ్మం పార్లమెంట్ కు పోటీచేస్తుంది..అయితే ఈసారి తనకు ఖమ్మం టికెట్ కావాలని విహెచ్ లాంటి వారు అడుగుతున్నారు . అందువల్ల వారి మధ్య ఐక్యత ఎలా ఉంటుంది అనేది ఆశక్తిగా మారింది.. చూద్దాం ఏమి జరుగుతుందో …!

Related posts

కేశవరావు ఒకే మరి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంగతేమిటి …కేటీఆర్

Ram Narayana

అవినీతికి పాల్పడిన వారిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం: జనగామలో అమిత్ షా

Ram Narayana

తెలంగాణ రాజకీయాల్లోనే షర్మిల… కానీ పోటీకి దూరం…?

Ram Narayana

Leave a Comment