Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సైలంట్ గా ఉండే కందాల తుమ్మల ,షర్మిల టార్గెట్గా వైలెంట్ అయ్యారు…!

సైలంట్ గా ఉండే కందాల తుమ్మల ,షర్మిల టార్గెట్గా వైలెంట్ అయ్యారు…!
ఐదేళ్లు జిల్లాను చేతిలో పెడితే ఏం చేశాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు
జిల్లా సంగతి దేవుడెరుగు ఆయనే ఎందుకు గెలవలేదని విమర్శ
బీఆర్ఎస్‌లో తుమ్మలకు జరిగిన అన్యాయం ఏంటన్న కందాల
షర్మిల తెలంగాణ కోడలు ఎలా అవుతారని ప్రశ్న
ఆమెకు ఖమ్మం జిల్లాతో ఏం సంబంధమని నిలదీత
పొంగులేటిని వదలని కందాల …ఆయన ప్రతిజ్ఞ కూడా చూద్దామన్నారు

పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సహజంగా చాలా సైలంట్ ఉంటారు…ఆయనపని ఆయన చేసుకుంటూ పోవడం ,తనదగ్గరకు వచ్చినవారికి తగిన సహాయం చేయడం ఆయన నైజం …ఎవరి పైన విమర్శలు చేయరు .తన ప్రత్యర్థులు చేసే విమర్శలను పెద్దగా పట్టించుకోరు …పేపర్లలో వచ్చిన వార్తలపై కూడా స్పందించరు…అసలు పేపర్లు తాను చూడనని కూడా చెపుతుంటారు …అలాంటిది ఆయనకు కోపం వచ్చింది..సైలంట్ గా ఉండే కందాల వైలెంట్ అయ్యారు . గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి కొన్ని నెలల్లోనే బీఆర్ యస్ చేరిన కందాల తిరిగి బీఆర్ యస్ నుంచి టికెట్ పొంది పోటీచేస్తున్నారు . ఎన్నికలకు మరో మూడు నెలలు ఉన్నప్పటికీ బీఆర్ యస్ అభ్యర్థులను ప్రకటించడంతో కందాల కు లైన్ క్లియర్ అయింది. టికెట్ ఆశించిన తుమ్మలకు కేసీఆర్ నో అన్నారు . దీంతో తుమ్మల క్యాంపు రగిలి పోతుంది.. పార్టీ ఏదైనా తుమ్మల పాలేరులో పోటిఖాయమని అంటున్నారు . కాంగ్రెస్ టికెట్ తుమ్మలకు వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కందాల తన నోరు విప్పారు . విప్పటమేకాదు తనపైన పోటీకి సిద్దమవుతారని భావిస్తున్న తుమ్మల , షర్మిల పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు . తన సైలెన్స్ ను బ్రేక్ చేశారు మాటలు తూటాలు పేల్చారు … ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు . దీంతో కందాల కూడా సైలంట్ కాదని అవసరమైతే వైలెంట్ అవుతారని చెప్పకనే చేప్పారు ..

అసలు బీఆర్ఎస్‌లో తుమ్మలకు జరిగిన అన్యాయం ఏంటని ప్రశ్నించారు. ‘‘2014లో ఓడిపోయిన తుమ్మలను పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడం అన్యాయమా? ఐదేళ్లు జిల్లాను అప్పజెబితే 2018లో ఒక్క సీటునూ గెలవలేదు. ఆయనా గెలవలేకపోయారు. తుమ్మలకు జిల్లాలో పట్టు ఉంటే ఎందుకు గెలిపించుకోలేదు?” అని ప్రశ్నించారు. కొందరు రాజకీయాల్లో ఫైటర్స్‌గా ఉంటారని, మరికొందరిది గాలి వాటమని ఎద్దేవా చేశారు.

ఇక షర్మిల తెలంగాణ కోడలు ఎలా అవుతారని కందాల ప్రశ్నించారు. షర్మిల తెలంగాణ కోడలు కాదనే విషయం అందరికీ తెలుసని, ఆమె మామ గారిది గుంటూరు అని చెప్పారు. షర్మిలకు ఖమ్మం జిల్లాతో ఏం సంబంధమని ప్రశ్నించారు. ‘‘షర్మిల పోటీ చేస్తామంటే స్వాగతిస్తాం. కానీ ఆమె రెండేళ్లుగా ఏం చెప్తున్నారు. రాజన్న రాజ్యం తెస్తామని, తానే సీఎం అవుతానని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ కోసం సోనియా గాంధీని కలిశారు” అని విమర్శించారు.

‘‘ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని పొంగులేటి చెబుతున్నారు. బీఆర్ఎస్‌ను ఒక్క సీటు కూడా గెలవనీయనని అంటున్నారు. ఎవరు గెలుస్తారు? ఎంత మంది గెలుస్తారు? అనేది త్వరలోనే తెలుస్తుంది. ప్రజలకు ఎవరిని గెలిపించుకోవాలో తెలుసు” అని చెప్పారు.

Related posts

శానమండలి ఎవరు కావాలి .. గోల్డ్ మెడలిస్ట్ నా…?బ్లాక్ మెయిలరా …కేటీఆర్

Ram Narayana

కాంగ్రెస్ కు 80 సీట్లు దాటడం ఖాయం… మల్లు భట్టి విక్రమార్క!

Ram Narayana

అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు: వివేక్ వెంకటస్వామి

Ram Narayana

Leave a Comment