Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ గూటికి తుమ్మల …హైద్రాబాద్ నివాసంలో తుమ్మలతో రేవంత్ భేటీ …!

కాంగ్రెస్ గూటికి తుమ్మల …హైద్రాబాద్ నివాసంలో తుమ్మలతో రేవంత్ భేటీ …!
తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న తుమ్మల
ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తుమ్మలకు దక్కని స్థానం
వందలాది కార్లతో యాత్ర చేపట్టిన తుమ్మల
నేడు తుమ్మలను కలిసిన రేవంత్ రెడ్డి, మల్లు రవి,సుదర్శన్ రెడ్డి

ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు … ఇందుకు సంబందించిన రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత ఐదు రోజులుగా తన స్వగ్రామం గండుగులపల్లి లో ఉన్న తుమ్మల హైద్రాబాద్ చేరుకున్నారు . గురువారం హైద్రాబాద్ లోని తుమ్మల నివాసంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ఉపాధ్యక్షడు మల్లు రవి , మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి తుమ్మలను కలిసి కాంగ్రెసులోకి రావాలని ఆహ్వానించారు .. తుమ్మల కాంగ్రెస్ నేతలకు శాలువా కప్పి ఆహ్వానించారు . వారితో చర్చించారు . అన్ని అనుకూలిస్తే సెప్టెంబర్ నెల మొదటి వారంలో లేదా రెండవవారం మొదట్లో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ చేరడం దాదాపు ఖరారు అయింది… మొదట తుమ్మల కాంగ్రెస్ లోనే ఉన్నారు . జలగం వెంగళరావు ,ప్రసాద్ రావు ల తరుపున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు .టీడీపీ ఆవిర్భావం అనంతరం ఎన్టీఆర్ పిలుపు మేరకు ఆయన కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు ..టీడీపీ లో సుదీర్ఘకాలం పాటు కీలక నేతగా ఎన్టీఆర్ , చంద్రబాబు ప్రభుత్వాలలో మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు …

ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరు లేదు. దాంతో తన సత్తా నిరూపించుకునేందుకు ఆయన వందలాది కార్లతో హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ యస్ జెండా ఒక్కటి కూడా కనిపించలేదు …పైగా కాంగ్రెస్ జెండా దర్శనమిచ్చింది …అప్పుడే ఆయన బీఆర్ యస్ కు గుడ్ బై చెప్పినట్లు అయింది…బీఆర్ యస్ నేతలు కల్సి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు … బీఆర్ యస్ కు కేసీఆర్ కు దగ్గరగా ఉంది పార్టీ గీత దాతకున ఉన్న తనను అవమానించడం పట్ల తుమ్మలతోపాటు ఆయన అనుయాయిలు రగిలి పోతున్నారు…

ఈ నేపథ్యంలో, నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తుమ్మల నాగశ్వరరావును కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు రవి కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా తుమ్మలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తుమ్మల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే సెప్టెంబరు రెండో వారంలో రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 6 లేదా 9 తేదీల్లో రాహుల్ సమక్షంలో తుమ్మల పార్టీలో చేరే అవకాశం ఉంది… ఇప్పటికే పొంగులేటి బీఆర్ యస్ కు బై చెప్పి కాంగ్రెస్ కు జై కొట్టిన నేపథ్యంలో తుమ్మల కాంగ్రెస్ చేరిక బీఆర్ యస్ కు పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉంది…

Related posts

భవిష్యత్ ముఖ్యమంత్రిని నేనే.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

బీఆర్ యస్ మంత్రి గంగుల కమలాకర్ కొత్త లాజిక్ …

Ram Narayana

కామారెడ్డి నుంచే పోటీ చేస్తా.. ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

Ram Narayana

Leave a Comment