- శ్రీశ్రీ కుమార్తె జస్టిస్ నిడుమోలు మాలాను శాశ్వత న్యాయమూర్తిగా ప్రతిపాదిస్తూ కొలీజియం సిఫార్సు
- ఇతర జడ్జీలనూ శాశ్వత న్యాయమూర్తులుగా చేయాలని కేంద్రానికి ప్రతిపాదన
- గతేడాది మార్చిలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ మాలా
మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తి, మహాకవి శ్రీశ్రీ కుమార్తె నిడుమోలు మాలాను కోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా కేంద్రానికి సిఫార్సు చేసింది. గతేడాది మార్చిలో నిడుమోలు మాలా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ మాలాతో పాటూ ఇతర అదనపు న్యాయమూర్తులు జస్టిస్ ఏఏ నక్కీరన్, జస్టిస్ ఎస్. సౌందర్, జస్టిస్ సుందరమోహన్, జస్టిస్ కె. కుమరేశ్‌బాబును శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది.