Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

న్యూస్ ఇన్ బ్రీఫ్….

 

సంస్థ ఐడి కార్డు ఉన్న జర్నలిస్టులు వ్యాక్సిన్ తీసుకోవచ్చు..

జర్నలిస్టులు సంస్థ ఐడీ కార్డు ఉంటే వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. నిన్న అక్రిడేషన్ ఉన్న కార్డు జర్నలిస్టులకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ తెలపడంతో చాలామంది జర్నలిస్టులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస రావు సార్ తో మాట్లాడి అక్రిడేషన్ కార్డు తో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టు వ్యాక్సిన్ ఇవ్వాలని 28, 29 తేదీలతో పాటు మరో ఐదు రోజుల పాటు వ్యాక్సిన్ సమయం పెంచాలని కోరారు. దీనికి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ఒప్పుకోవడం జరిగింది. కావున జర్నలిస్టులు ఆందోళన చెందకుండా సంస్థ ఐడి కార్డ్, ఆధార్ కార్డుతో వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని గౌటి రామకృష్ణ కోరారు.

ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్

 

ఖమ్మం జిల్లా వాసులకు అందుబాటులోకి చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు
మెగాస్టార్ చిరంజీవి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఈరోజు 27-5-2021 సాయంత్రం 4:00pm ఖమ్మం బుర్హన్ పురం ఆంజనేయ స్వామి గుడి సమీపంలో*డాక్టర్ వేంకటేశ్వరావు సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హేడ్ క్వార్టర్స్ గారు ప్రారంభిచారు,
ఈ రోజు నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లావాసులకు అందుబాటులోకి వస్తుంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా చిరంజీవి అభిమాన సంఘం అధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకు ను ప్రారంభించటం జరిగింది, ఆక్సిజన్ కోరకు ఆధార్ కార్డు,రేషన కార్డు, డాక్టర్ రిఫర్ చేసిన సర్టిఫికెట్, డాక్టర్ ప్రేసిఫేక్ష్న్ RTPCR రిపోర్ట్ లతో సంప్రదింపులు జరపాలని కోరారు, చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఉచితంగా అందిచటం జరుగుతోంది అని తెలిపారు,
అవసరమైన ప్రతీ ఒక్కరూ ఈ సేవలు వినియోగించుకోవచ్చు.
ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఉన్నవారు ఈ కింది వారిని సంప్రదించండి.

సంప్రదించావలసిన ఫోన్ నంబర్స్
G. వీరేశ్ గౌడ్..9848882551
గంగిశెట్టి శ్రీనివాస్..9397345333
Md. సాదిక్ అలీ..9912234466. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం నాయకులు G, వీరేశ్ గౌడ్, గంగి శేట్టి శ్రీనివాస్, కోప్పు సుమంత్, అంకటి మహేందర్, ch, కిషోర్ గుప్తా, ఉపేంద్ర చౌదరి, సాధిక్ ఆలి, సోమా నరేష్ పాల్గొన్నారు…

4 వ డివిజన్ లో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ
కార్పోరేటర్ దండా జ్యోతి రెడ్డి (అయ్యప్ప రెడ్డి)
_ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _

 

 

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో నివారణ చర్యల్లో భాగంగా ఖమ్మం నగరం 4 వ డివిజన్ రాజీవ్ నగర్, రాజీవ్ నగర్ గుట్ట, మంచికంటి నగర్, వేణుగోపాల నగర్, అభయ వెంకటేశ్వర నగర్, పార్కు ఏరియా, ఆర్చి రోడ్డు, బాలాజీ నగర్ ప్రాంతం, యూటి ఫ్ కాలనీ, అమరావతి నగర్, పాండురంగాపురం లోని కొంత ప్రాంతం, నాలుగో డివిజన్ * ప్రాంతాలలో క్షేత్రస్తాయి పర్యటన చేస్తు గళ్ళీ గళ్ళీ లోను స్థానిక కార్పోరేటర్ దండా జ్యోతి రెడ్డి (అయ్యప్ప రెడ్డి) హైడ్రోక్లోరిక్ ద్రావణాన్ని తగు జాగ్రత్తలు పాటిస్తూ పిచికారీ చేయిస్తూ తనూ పాల్గొన్నారు. డివిజన్లో *కొవిడ్ కట్టడికి సహాయ సహకారాలు అందిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు , మున్సిపాలిటీ సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమం లో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

ఖమ్మం జిల్లా పరిషత్  సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరైన  లింగాల కమల్ రాజు

 

ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు , సీఈఓ ప్రియాంక , డిప్యూటీ సీఈఓ శ్రీ రామ్

➖ ఈ సందర్భంగా మాట్లాడుతూ covid కారణంగా సమావేశాన్ని వాయిదా వేశారు.

➖ అనంతరం కారుణ్య నియామకాల ద్వారా నలుగురు అర్హత కలిగిన వారికి జూనియర్ అసిస్టెంట్లు గా నియామక పత్రాలు అందజేయడం జరిగింది.

వివరాలు…

1.బర్రె మధు
భద్రాద్రి కొత్తగూడెం
2. ఎస్ ప్రణీత్
ఎంపీపీ కల్లూరు
3. ఎస్కే గౌస్ భాష
భద్రాద్రి కొత్తగూడెం
4. యం ఉపేందర్ రావు
జెడ్పీఎస్ఎస్ రెబ్బవరం

➖ ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఉద్యోగ సంఘ నాయకులు రాజేష్, ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు అధికారులు జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

కరోనాతో పాత్రికేయుల మృతి విచారకరం.:బద్రు నాయక్

 

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి.
____'””””””‘________
ఖమ్మం : ఇటీవల జిల్లా కేంద్ర మైన ఖమ్మంలో అరడజను పైగా పాత్రికేయులు కరోనాతో మృతి చెందటం విచారకరమని , రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు . జర్నలిస్టు సంఘాల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించినప్పటికీ అక్రిడేషన్ తో ముడిపెట్టడం తగదని అన్నారు . అక్రిడేషన్ తో సంబంధం లేకుండా పని చేస్తున్న పాత్రి కేయులoదర్నీ వారియర్స్ గానే గుర్తించాలని సూచించారు . మానవతా దృక్పథం మేరకు కు ఆయా పత్రికలలో పనిచేస్తున్న అందరినీ యాజమాన్యాలు సైతం సహాయం చేయాలని కోరారు . ఇటీవల ఖమ్మం నగరంలో వరుసగా పాత్రికేయుల మరణం దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు . మృతిచెందిన పాత్రికేయులలో కొందరు తనకు అత్యంత సన్నిహితులని , వారి మృతి తీరనిలోటని అన్నారు . పాత్రికేయుల మృతి పట్ల సంతాపం , సానుభూతిని , ప్రకటించారు . మరణించిన జర్నలిస్టు మిత్రుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం 10 లక్షల మేరకు పరిహారం అందరు చేస్తుందన్నారు . ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కూడా ఈ విధమైన సహాయం అందించాలని డిమాండ్ చేశారు . కరోనా మొదటి దశ , రెండవ దశ వలే తర్వాత మూడో దశ సైతం ఉంటుందని వినిపిస్తున్న ప్రచారం సందర్భాన్ని పురస్కరించుకొని మరిన్ని మరణాలు సంభవించ కుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు .

 

 

 

 

 

 

 

 

Related posts

అభిమాని అత్యుత్సాహం…ప్రమాదం తప్పించుకున్న పవన్ కల్యాణ్!

Drukpadam

పేదింటి ఆడ పిల్ల ఇంట్లో చిరునవ్వులు చిందించాలనే కల్యాణలక్ష్మి.. మంత్రి పువ్వాడ!

Drukpadam

భార‌త్‌లో క‌రోనా ప‌రిస్థితులపై ఐఎంఎఫ్ ఆందోళ‌న‌…

Drukpadam

Leave a Comment