- ముడుపుల వ్యవహారంపై అమెరికా కోర్టులో కేసు నమోదు
- ఒప్పందాలపై విచారణ జరపాలని ఏసీబీకి ఫిర్యాదు చేసిన చక్రవర్తి
- జగన్ కు రూ. 1,750 కోట్ల లంచం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్న వైనం
వైసీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు అదానీ నుంచి ముడుపులు అందాయనే విషయం ఏపీలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై అమెరికా కోర్టులో కేసు నమోదయింది.
ఈ నేపథ్యంలో సెకీతో ఒప్పందంపై విచారణ జరపాలని కోరుతూ సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నలమోతు చక్రవర్తి ఏపీ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. జగన్ కు రూ. 1,750 కోట్ల లంచం ఇచ్చినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని కోరారు.