Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తుమ్మల బాటలో మాజీమంత్రి మండవ …బీఆర్ యస్ కు గుడ్ బై …

తుమ్మల బాటలో మాజీమంత్రి మండవ …బీఆర్ యస్ కు గుడ్ బై …
కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం ….
ఇప్పటికే మండవ అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరిక
కవిత ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానం
ఆ తర్వాత మండవని కేసీఆర్ పట్టించుకోకపోవడంతో పార్టీ కి దూరం

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓటర్లను ప్రభావం చేయగలిగిన కమ్మ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతలు బీఆర్ యస్ కు దూరం అవుతున్నారు .సీనియర్ రాజకీయ నాయకుడు మాజీమంత్రి తుమ్మల బీఆర్ యస్ కు బై చెప్పిన రెండు మూడు రోజుల్లోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీమంత్రి అదే సామాజికవర్గానికి చెందిన మండవ వెంకటేశ్వరరావు బీఆర్ యస్ కు గుడ్ బై చెపుతూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది…ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి నుంచి నాలుగు సార్లు , నిజామాబాద్ రూరల్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మండవ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చాలాకాలం పనిచేసిన సీనియర్ నేత ..

పాలేరు టికెట్ ఇవ్వకపోవడంతో తుమ్మల బీఆర్ యస్ కు దూరం కాగా , మండవ వెంకటేశ్వరరావు చాలారోజులుగా బీఆర్ యస్ చేరినప్పటికీ ఒక్క ఎమ్మెల్సీ కవిత ఎన్నికల సందర్భంగా తప్ప పార్టీకి ఎక్కడ ప్రచారం చేయలేదు ..అదికూడా కవిత ఎమ్మెల్సీ గా పోటీచేసినప్పుడు సీఎం గా ఉన్న కేసీఆర్ హైద్రాబాద్ లో ఉంటున్న మండవ ఇంటికి స్వయంగా వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు . సీఎం ఇంటికి వచ్చినందున మండవ కూడా కాదనలేక పోయారు . తర్వాత పార్టీలో ఎక్కడ మండవకు ప్రాధాన్యతలేదు …రాజ్యసభ సీట్లు ఎమ్మెల్సీ సీట్ల విషయంలో కూడా కేసీఆర్ సీనియర్ నేతలను పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పడం తప్ప తర్వాత చేసింది ఏమి ఉండదని అనేక మంది నేతలు అభిప్రాయపడుతుంటారు .. అదే సామాజికవర్గానికి చెందిన మరికొంత మంది బీఆర్ యస్ కు గుడ్ బై చెపుతారని ప్రచారం జరుగుతుంది…

తెలంగాణ లో కమ్మ సామాజికవర్గం సంఖ్య పరంగా తక్కువే అయినప్పటికీ 25 నుంచి 30 సీట్లలో ప్రభావం చూపగలుగుతుంది.. అయితే దానికి తగ్గట్లుగానే పువ్వాడ అజయ్ , మంత్రిగా ఉండగా , ఖమ్మం ఎంపీగా నామ నాగేశ్వరరావు ఉన్నారు .ఎమ్మెల్యేలుగా అరికపూడి గాంధీ, కోనేరు కోనప్ప , నల్లమోతు భాస్కర్ రావు, మాధవరం కృష్ణారావు లు,ఎమ్మెల్సీ తాతా మధు ఉన్నారు . వ్యవసాయ రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో వీరి పునాదులు బలంగానే ఉన్నాయి …చిత్రపరిశ్రమలోను , రియల్ ఎస్టేట్ , ఫార్మారంగంలో కీలకంగా ఉన్నారు . రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర వహిస్తున్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ గూటికి చేరి కేసీఆర్ కు అండదండలుగా ఉన్న ఈసామాజికవర్గంలో బలమైన బలుకుబడి ఉన్న కీలక నేతలు బీఆర్ యస్ కు దూరం కావడం ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

Related posts

ఎన్నికల్లో బీజేపీ తన శక్తిమేరకు సమర్థవంతంగా పని చేసింది: కిషన్ రెడ్డి

Ram Narayana

కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పనిచేసుకోవాలి: మంత్రి సీతక్క

Ram Narayana

ప్రజాస్వామ్యంలో ఉన్నమా? పాకిస్థాన్ లోనా?.. పోలీసులపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్..

Ram Narayana

Leave a Comment