తెలంగాణ రాజకీయాల్లోనే షర్మిల… కానీ పోటీకి దూరం…?
పాలేరు పై ఆశలు వదులుకోవాలని చెప్పిన ఏఐసీసీ
బేషరత్ గానే కాంగ్రెస్ లో చేరేందుకు షర్మిల అంగీకారం
తనకు ప్రియాంక ఎంతో నువ్వు అంతే అన్న సోనియా గాంధీ
హైద్రాబాద్ చేరుకున్న షర్మిల …షర్మిల నిర్ణయంపై అనుయాయుల అసంతృప్తి
ఆమెను నమ్ముకొని పార్టీలో చేరితే నట్టేట ముంచారని ఆగ్రహం
కొండా రాఘవరెడ్డి గుడ్ బై …గట్టు రామచందర్ రావు మండిపాటు
వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇక అదృశ్యం కానున్నది …ఆ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి పార్టీని నడపలేనని చేతులెత్తేశారు … తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు నిర్ణయించుకున్నారు .ఈ మేరకు ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ పెద్దలను ఒకసారి కలిశారు . రెండవసారి ఆమె బుధవారం ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ , రాహుల్ గాంధీని కలిశారు …తన మనసులోని మాటలను వారితో పంచుకున్నారు … ఎన్నికల్లో తనతోపాటు కొందరికి టికెట్స్ ఇవ్వాలని కోరారు . తన పార్టీని విలీనం చేయడమా…? లేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడమా అనే అంశం చర్చకు వచ్చింది. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం బేషరత్ గా పార్టీకి సహకరించాలని రాజకీయ భవిష్యత్ తమకు వదిలి వేయాలని వారు సూచించినట్లు సమాచారం … పాలేరులో పోటీచేయాలని అనుకున్న ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా స్టార్ క్యాంపెనర్ గా ఉంటారని తెలుస్తుంది.. అందుకు సమ్మతించిన షర్మిల త్వరలో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు . ముందుగా పులివెందుల వెళ్లి అక్కడ నుంచి ఇడుపులపాయలోని తండ్రి సమాధివద్ద కు వెళ్లి నివాళులు అర్పించిన అనంతరం తన నిర్ణయాన్ని చెపుతానని అన్నారు .
అయితే సోనియా గాంధీ , రాహుల్ తో చర్చల సందర్భంగా ఏపీ రాజకీయాలపై ఆమె అభిప్రాయాన్ని వారు అడిగారని సమాచారం …ఆమె మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఉండేందుకే ఇష్టపడుతున్నందున వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కేవలం ప్రచారం మాత్రమే చేయాలనీ షరతు పెట్టినట్లు తెలుస్తుంది. అందుకు కూడా ఆమె అగీకారం తెలిపారని విశ్వసనీయ సమాచారం….
షర్మిలను నమ్ముకున్నవారి రుసరుసలు …
షర్మిల తెలంగాణ లో రాజన్న సంక్షేమ రాజ్యం తెస్తానని పార్టీ పెట్టిన సందర్భంగా చెప్పితే రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఆ పార్టీలో చేరిన అనేక మంది షర్మిల తీసుకోబోతున్న నిర్ణయంపై రుసరుసలాడుతున్నట్లు తెలుస్తుంది…. ఆమె మాటలు నమ్మి అండగా ఉన్నామని ఆమె ఒక్కసారిగా తెల్లజెండా ఎత్తడంపై మండి పడుతున్నారు .మొదటి నుంచి షర్మిలకు అండదండగా ఉన్న సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి షర్మిల పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు . తమ పోరాటం అంతా కాంగ్రెస్ తోనే అని ఆమె కాంగ్రెస్ లోకి వెళ్ళతామంటే తామెందుకు వెళతామని అన్నారు . అదే విధంగా మరో కీలక నేత గట్టు రామచందర్ రావు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి కుటంబాన్ని అవమాన పరిచిన విషయాన్నీ గుర్తు చేశారు . లేక్వ్యూ అతిధి గృహం వద్ద అర్ధరాత్రి నడిబజారులో నిరసన తెలిపినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు . నాడు కాంగ్రెస్ పార్టీ జగన్ పై కేసులు పెట్టి రాజశేఖర్ రెడ్డిని కూడా ముద్దాయిగా చేర్చిన విషయం షర్మిల గుర్తుంచుకోకున్న లక్షలాది మంది రాజశేఖరెడ్డి అభిమానాలు మర్చిపోలేదని అన్నారు . ఆమె తమకు మాటమాత్రంగానైనా చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడంపై భగ్గుమన్నారు . షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లడంపై అనేక మంది కార్యకర్తలు అభ్యంతరాలు చెపుతున్నారని ఏపూరి సోమన్న తమ పార్టీ తరుపున తుంగతుర్తి లో పోటీచేస్తారని తోలి ప్రకటన చేసి అతనిలో ఆశలో రేకెత్తించి ఇలా చేయడం సబబు కాదని మరికొందరు అంటున్నారు . షర్మిల తీసుకోబోయే నిర్ణయం రైట్ అవుతుందా ..? లేక రాంగ్ అవుతుందా …? అనేది చూడాల్సిందే ….!