Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అరుదైన దృశ్యం ….తుమ్మల ,పొంగులేటి ఆత్మీయ ఆలింగనం సరదా మాటలతో నవ్వులు పూవించిన నేతలు ..

అరుదైన దృశ్యం ….తుమ్మల ,పొంగులేటి ఆత్మీయ ఆలింగనం సరదా మాటలతో నవ్వులు పూవించిన నేతలు ..
ఖమ్మంలోని తుమ్మల ఇంటికి పొంగులేటి..
తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన పొంగులేటి
తుమ్మలకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని వ్యాఖ్య
మీడియా ముందుకు ఇద్దరు నేతలు …బీఆర్ యస్ తీరుపై విమర్శలు
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్ పద్ధతి ఉందని విమర్శ

ఖమ్మంజిల్లా రాజకీయాల్లో కీలక పరిణామ చోటుచేసుకుంది…ఉత్తర దృవం ,దక్షణ దృవంగా ఉన్న ఇద్దరు నేతలు కలుసుకోవడం ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం శనివారం ఖమ్మంలో అరుదైన దృశ్యంగా మారింది…తుమ్మల ఇంటికి ఖమ్మం మాజీఎంపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళుతున్నారని విషయం ఆసక్తికర పరిణామంగా మారింది…వీరి కలయిక చూసేందుకు అనేక మంది అభిమానులు ,మీడియా ప్రతినిధులు ఖమ్మంలోని గొల్లగూడెంలో తుమ్మల నివాసానికి చేరుకున్నారు . తుమ్మల ,పొంగులేటి పాత మిత్రులే అయినా, గత నాలుగు సంవత్సరాల నుంచి వారు ఇక్కడో , అక్కడో కలిసినప్పటికీ ఎడమొఖం ,పెడమొఖంగా పొడిపొడి మాటలు మాత్రమే వారి మధ్య ఉండేవి … ఇద్దరు బీఆర్ యస్ లో ఉన్నప్పటికీ వారి మధ్య సంబంధాలు అంతంతమాత్రమే … బీఆర్ యస్ కు దూరమైనా పొంగులేటి ఆరు నెలలు ఆలోచనలు చేసి ఎట్టకేలకు జులై లో కాంగ్రెస్ లో చేరగా ,తుమ్మల ఇటీవలనే బీఆర్ యస్ కు బైచెప్పి కాంగ్రెస్ కు దగ్గర అవుతున్న సందర్భంలో వీరి కలయికకు ప్రాధాన్యత ఏర్పడింది…తుమ్మల ఇంటికి వచ్చిన పొంగులేటిని మర్యాద పూర్వకంగా ఆహ్వానించినా తుమ్మల శాలువాతో సత్కరించారు . పొంగులేటి కూడా తుమ్మలకు బొకే అందించి శాలువాతో సత్కరించి కాంగ్రెసులోకి రావాలని సాదరంగా ఆహ్వానించారు..వారి మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు పూవించింది…. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వీరివురి నేతల కలయిక కీలక పరిణామంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు .

సీనియర్ రాజకీయవేత్త తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారనే వార్త రాజకీయవర్గాల్లోను ఆసక్తిని కలిగించింది… తుమ్మల ఇంటికి పొంగులేటి దాదాపు నాలుగేళ్ల తర్వాత వెళ్లడం అదికూడా రాజకీయ కలయికకు దారితీసే పరిణామం కావడంతో చర్చనీయాంశంగా మారింది… ఇద్దరూ ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో పొంగులేటి మాట్లాడుతూ… ఏ పార్టీలో ఉన్నా తుమ్మల ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తారని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. ఇప్పటికే తుమ్మలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారని… తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్, బీఆర్ఎస్ పద్ధతి ఉందని విమర్శించారు.కేసీఆర్ పొమ్మనకుండా పొగపెడతారని దుయ్యబట్టారు. తనకు చేసిన విధంగానే తుమ్మలను కూడా అవమానాలకు గురి చేశారని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 10 కి 10 సీట్లు క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ను వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తాను తన అనుచరులు, మద్దతుడారులతో చర్చించానని… వారందరి సూచనల మేరకే కాంగ్రెస్ లో చేరానని పొంగులేటి చెప్పారు. తుమ్మల కూడా వారి అనుచరులతో మాట్లాడి, ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. తుమ్మల కూడా తనను కాంగ్రెసులోకి రమ్మని ఆహ్వానాలు వస్తున్నవిషయాన్ని నిర్దారించారు . పొంగులేటి కూడా ఆహ్వానించారని తన అభిమానులు హితులు , సన్నిహితులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని పీసీసీ నాయకత్వానికి కూడా చెప్పానని త్వరలో తన నిర్ణయం ఉంటుందని తెలిపారు …

Related posts

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైంది …మంత్రి కోమటి రెడ్డి

Ram Narayana

తాను పార్టీ మారడంలేదు మొర్రో అంటున్న వివేక్ వెంకటస్వామి ….!

Ram Narayana

కేసీఆర్ ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ గారూ?: వైఎస్ షర్మిల

Ram Narayana

Leave a Comment