Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్ కానున్నారా …?

బీఆర్ యస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్ కానున్నారా …?
బయలుదేరిన గుసగుసలు … కంగారులో బీఆర్ యస్ వర్గాలు
మాజీమంత్రికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యే
తాను పార్టీ మారేది లేదంటున్న ఎమ్మెల్యే
తనను అన్ని విధాలుగా కేసీఆర్ అండగా ఉన్నాడని వ్యాఖ్య

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి…ఇప్పటికే అనేకమంది నేతలు గ్రామసర్పంచులు …ఎంపీటీసీలు , జడ్పీటీసీలు ,కో ఆపరేటివ్ చైర్మన్లు , డైరెక్టర్లు అధికార బీఆర్ కు బై చెప్పి కాంగ్రెస్ లో చేరినసంగతి తెలిసిందే .కొత్తగూడెం జిల్లాపరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ,వైరా మున్సిపల్ చైర్మన్ సుతగాని జైపాల్ ,కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ లాంటి అనేక మంది బీఆర్ యస్ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో పొంగులేటితోపాటు చేరారు…

జిల్లాలో బీఆర్ యస్ కు పాలేరు సీటు ఆశించిన మాజీమంత్రి తుమ్మల గుడ్ బై చెప్పారు ..ఆయన వచ్చే వారంలో కాంగ్రెస్ లో చేరనున్నారు…గురువారం హైద్రాబాద్ లోని తుమ్మల నివాసానికి వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి , పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తుమ్మల ఇంటికి వెళ్లి సాదరంగా కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు . అందుకు తుమ్మల సానుకూలంగా స్పందించారని వార్తలు వచ్చాయి. శనివారం ఖమ్మంలో మాజీఎంపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో -చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల ఇంటికి వెళ్లి కాంగ్రెసులోకి రావాలని ఆహ్వానించారు . తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు …

మాజీమంత్రికి అత్యంత దగ్గరగా ఉన్న ఒక బీఆర్ యస్ ఎమ్మెల్యే తుమ్మల దారిలో పయనిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి…దీంతో బీఆర్ యస్ వర్గాలు కంగారు పడుతున్నాయి…ఈ విషయాన్నీ ఆ ఎమ్మెల్యే దగ్గర కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తాను పార్టీ మారేది లేదని ,కేసీఆర్ తిరిగి టికెట్ ప్రకటించడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇచ్చి అండగా ఉన్నారని ఎవరో కావాలని పుకార్లు పుట్టిస్తున్నారని పార్టీ మార్పును కొట్టి పారేశారు …

Related posts

ఖమ్మం కాంగ్రెస్ కు బలమైన నేతలు …అదే వారి బలహీనత అవుతుందా…?

Ram Narayana

ఖమ్మమా మజాకానా … !రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు….

Ram Narayana

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా రేపు విడుదల?

Ram Narayana

Leave a Comment