Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్

  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
  • నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
  •  మరికాసేపట్లో విజయవాడకు తరలింపు
  • స్కిల్ డవలప్మెంట్ నిధుల దుర్వినియాగం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్
  • మొత్తం 16 సెక్షన్స్ కింద కేసు నమోదు ఇది అన్యాయం అధర్మమన్న చంద్రబాబు
  • నంద్యాలలో అరెస్ట్ … వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడకు తరలింపు
  • విశాఖలో ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ రావు అరెస్టు …
  • గొడవలు జరగకుండా పలువురి టీడీపీ నేతల హౌస్ అరెస్టులు

  • టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని స్కిల్ డవలప్మెంట్ నిధుల దుర్వినియాగం కేసులో అక్రమాలకు పాల్పడ్డాడని సి ఐ డి పోలీసులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేశారు . నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 6 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనకు నోటీసు ఇచ్చి  అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.  చంద్రబాబును కలిసిన అధికారులు మిమ్ములను అరెస్ట్ చేస్తున్నామని తెలపడం …ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ఆయన అడగటం ..స్కిల్ డవలప్మెంట్ నిధుల దుర్వినియాగం కేసులో మిమ్ములను అరెస్ట్ చేస్తున్నామని సి ఐ డి అధికారులు చెప్పడం దానికి సంబందించిన వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసుల వివరాలను ఆయనకు అందజేయడం వెంట వెంటే జరిగిపోయాయి..వివిధ సెక్షన్ల కింద మొత్తం 16 కేసులు నమోదు చేశారు . ఇందులో ఏ 1 ముద్దాయిగా చంద్రబాబును చేర్చారు ..ఇది అన్యాయం అక్రమమని చంద్రబాబు మొత్తకున్న అధికారులు వినకుండా అరెస్ట్ చేసి ఆయన వాహనంలోనే వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడకు తరలించారు .
  • చంద్రబాబు అరెస్ట్ పాటుమరికొంతమందిని అరెస్టు చేశారు . విశాఖలో ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ రావు ను అదుపులోకి తీసుకున్నారు . చంద్రబాబు పీఏ శ్రీనివాస్ రావు కోసం వెళ్ళితే ఆయన విదేశాలకు విదేశాలకు జంప్ అయ్యారని అంటున్నారు . మరో కీలక వ్యక్తం కోసం పోలీసులు గాలిస్తున్నారు .
  • ఏపీ లో హై అలర్ట్ …రోడ్ పై బైఠాయించి లోకేష్ నిరసన …

చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు లోకేశ్ యత్నం… పోలీసులు అడ్డుకోవడంతో వర్షంలోనే నిరసన

Lokesh protests at his camp site after police arrested Chandrababu

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ విషయం తెలియడంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. 

అయితే, చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎలాంటి నోటీసులు లేకుండా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం పట్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నోటీసులు ఏవని అడిగితే పోలీసులు డీఎస్పీ వస్తారు అని సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది. లోకేశ్ వద్దకు మీడియాను కూడా అనుమతించడంలేదని సమాచారం. 

ఈ నేపథ్యంలో నారా లోకేశ్ వర్షంలోనే తన క్యాంప్ సైట్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. లోకేశ్ భద్రతాధికారి జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. స్థానిక పోలీసు అధికారులు వచ్చి మాట్లాడతారని ఎస్పీ బదులిచ్చారు. పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

  • మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి అల్లరులు జరగకుండా రాష్ట్రవ్యాపితంగా హైఅలర్ట్ ప్రకటించారు . కొంతమంది టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు . యువగళం పాదయాత్రలో ఉన్న తనయుడు నారా లోకేష్ తన తండ్రి దగ్గరు వెళ్లాలని చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు . దీంతో లోకేష్ రోడ్ పై బైఠాయించి నిరసన తెలిపారు .

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల నిలిపివేత

  • ముందుజాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్న పోలీసులు
  • బస్సులన్నీ డిపోలకే పరిమితం
  • విశాఖలో ప్రయాణికులను దించి మరీ డిపోలకు తరలింపు
  • టికెట్ డబ్బులు వెనక్కి
  • సిటీ బస్సులు కూడా రోడ్డెక్కని వైనం
Chandrababu Arrest APSRTC Buses Cancelled Statewide

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పోలీసులు నిలిపివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అన్ని బస్సులను నిలిపివేయగా, విజయవాడలో సిటీ బస్సులు కూడా రోడ్డుపైకి రాలేదు. 

పోలీసుల ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. విశాఖపట్టణంలోని ద్వారక బస్‌స్టేషన్‌లో ప్రయాణికులను కిందికి దించి మరీ బస్సులను డిపోలకు తరలించారు. అప్పటికే టికెట్ తీసుకున్న ప్రయాణికులకు డబ్బులు వెనక్కి ఇచ్చారు. రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు మాత్రం కాసేపు వేచి చూడాలని సూచించారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డిపోల నుంచి కూడా బస్సులు బయటకు రాలేదు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బస్సులను నిలిపివేశారు.

చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండిస్తోంది: పురందేశ్వరి

BJP is condemning Chandrababu arrest says  Purandeswari

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ… ఈరోజు చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని… సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయనను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండిస్తోందని తెలిపారు. 

మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేశారు. ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. 

గతంలో జగన్ ను కూడా ఇంత అవమానకర రీతిలో అరెస్ట్ చేయలేదు: సీఎం రమేశ్

CM Ramesh reacts to Chandrababu arrest

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్పందించారు. ఇది అక్రమ అరెస్ట్ అని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్ లో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరంగా ఉందని పేర్కొన్నారు. 

ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, విచారణ చేయకుండా, నోటీసులు లేకుండా ఒక విపక్ష నాయకుడ్ని అరెస్ట్ చేయడం కేవలం కక్ష సాధింపు మాత్రమేనని అభిప్రాయపడ్డారు. 

గతంలో జగన్ ను అరెస్ట్ చేసే ముందు ఆయనను అనేక పర్యాయాలు విచారించి, నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేశారని సీఎం రమేశ్ గుర్తు చేశారు. అంతేతప్ప, ఇలా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు స్థానం లేదని ఉద్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలను మానుకోవాలని సీఎం రమేశ్ హితవు పలికారు. అదే సమయంలో పోలీసుల తీరును ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు.

చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna response on Chandrababu arrest

టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట వచ్చి హంగామా చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఏదైనా ఉంటే ముందుగానే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని అన్నారు. తన తండ్రి వద్దకు వెళ్లకుండా నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు.




Related posts

కొత్త పార్టీ పెడుతున్న గద్దర్… పార్టీ పేరు ఇదే!

Drukpadam

శ్రీలంకలో దుర్భర పరిస్థితులు.. ఆహారం లేక అలమటిస్తున్న ప్రజలు!

Drukpadam

సోనీ-జీ కంపెనీల మధ్య విలీన ఒప్పందం…

Drukpadam

Leave a Comment