- చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమన్న తుమ్మల
- రాజకీయ కక్షతో ఆయన పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని వ్యాఖ్య
- అసత్యాలతో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆవేదన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. తుమ్మల మూడు దశాబ్దాలకు పైగా టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆ పార్టీని వీడారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు.
తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. రాజకీయ కక్షతో ఆయన పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. అసత్యాలతో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ సమయంలో కనీస న్యాయసూత్రాలు పాటించలేదన్నారు. మాజీ సీఎం పట్ల అమర్యాదగా ప్రవర్తించారన్నారు.