- మావోయిస్టులకు ఆధునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరాపై అనుమానాలు
- వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో సోదాలు
- సోదాల్లో డ్రోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు స్వాధీనం
తెలంగాణవ్యాప్తంగా ఎనిమిదిచోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. మావోయిస్టులకు ఆధునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు సరఫరా అవుతున్నాయనే అనుమానాలతో శనివారం దాడులు నిర్వహించింది. వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున డ్రోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పన్నెండు మందిపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.