Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

చాలెంజ్ చేసి చెబుతున్నా..అమిత్ షా అనుమతితోనే చంద్రబాబును అరెస్ట్ : సీపీఐ నారాయణ

చాలెంజ్ చేసి చెబుతున్నా..అమిత్ షా అనుమతితోనే చంద్రబాబును అరెస్ట్ : సీపీఐ నారాయణ
చంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందన్న నారాయణ
మోదీ, అమిత్ షాకు తెలియకుండా ఓ మాజీ సీఎంను అరెస్ట్ చేయలేరని వెల్లడి
బీజేపీ కాపాడుతుందని చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని వ్యాఖ్యలు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. కోర్ట్ కూడా ఉదయం నుంచి ఇరుపక్షాల వాదనలు విన్నంతరం సాయంత్రం 14 రోజులు రిమాండ్ కు పంపుతూ తీర్పు నిచ్చింది … దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఆదివారం ఖమ్మం వచ్చిన ఆయన యువత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు . యువకులతో పాటు కర్రసాముచేశారు . ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు … ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియకుండా ఓ మాజీ ముఖ్యమంత్రిని జగన్ అరెస్ట్ చేయగలడా? అని ప్రశ్నించారు.

“నేను చాలెంజ్ చేస్తున్నా… అమిత్ షాకు తెలియకుండా చంద్రబాబునాయుడ్ని అరెస్ట్ చేసే అవకాశం లేదు. జగన్ మోహన్ రెడ్డి… అమిత్ షా అనుమతితోనే చంద్రబాబును అరెస్ట్ చేశాడు. ఇప్పుడు రాజకీయాలు ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలి. దీనివెనుక ఎవరున్నారో ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకోవాలి. బీజేపీ కాపాడుతుందని చంద్రబాబు భ్రమల్లో ఉన్నారు. అమిత్ షా ఒక్క మాట అంటే చాలు జగన్ భయపడిపోతాడు. బీజేపీ హస్తం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. బీజేపీని, వైసీపీని దూరంగా పెడితే తప్ప తెలుగు ప్రజలకు న్యాయం జరగదు” అని నారాయణ స్పష్టం చేశారు.

జగన్ ను మర్డర్ కేసుతో , లిక్కర్ స్కాం తో కేసీఆర్ ను బీజేపీ తమ గుప్పట్లో పెట్టుకుందని నారాయణ అభిప్రాయపడ్డారు . చంద్రబాబు కూడా బీజేపీ తనకు ఎదో చేస్తుందని భ్రమల్లో ఉన్నారని వాటినించి బయటకు రావాలని అన్నారు .

తెలంగాణాలో తమ పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో ప్రయాణం చేస్తుందని అన్నారు . ఇప్పటికి కాంగ్రెస్ నేతలతో మాట్లాడమని అన్నారు .

Related posts

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ … భగ్గుమన్న మటన్ ,చేపల ధరలు …

Ram Narayana

అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసుల నోటీసులు…

Ram Narayana

ఏపీ ,తెలంగాణ సీఎంలు చంద్రబాబు , రేవంత్ రెడ్డి భేటీపై ఆసక్తి

Ram Narayana

Leave a Comment