Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్

  • చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • ఈ నెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్
  • చంద్రబాబును వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ ను విధించింది. చంద్రబాబుకు 14 రోజులు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో టీడీపీ రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. మరోవైపు, చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ వేసింది. వారం రోజుల కస్టడీకి కోరింది. ఈ పిటిషన్ ను కోర్టు రేపు విచారించే అవకాశం ఉంది. మరోవైపు, కోర్టు తీర్పుతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. జాతీయ రహదారులపై ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. 

 ఏపీలోని అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధింపు… రేపు బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ

స్కిల్ డెవలప్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో, పరిస్థితులను  దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు వెళ్లాయి. 

ఇక, చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రం అంతటా బంద్ కు పిలుపునిస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలన్న పిటిషన్ పై ముగిసిన వాదనలు

  • చంద్రబాబుకు సెప్టెంబరు 22 వరకు రిమాండ్
  • హౌస్ అరెస్ట్ పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు
  • ఆరోగ్యం, వయసు, హోదా దృష్ట్యా హౌస్ అరెస్ట్ విధించాలన్న సిద్ధార్థ లూథ్రా
  • వ్యతిరేకించిన సీఐడీ తరఫు న్యాయవాది
  • కాసేపట్లో నిర్ణయం వెలువరించనున్న న్యాయస్థానం

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఆయనకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కుంభకోణంలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. 

అయితే, రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలని చంద్రబాబు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, వయసు, హోదాను దృష్టిలో ఉంచుకుని హౌస్ అరెస్ట్ విధించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ హౌస్ అరెస్ట్ పిటిషన్ ను సీఐడీ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఈ అంశంపై వాదనలు ముగియగా, మరికాసేపట్లో న్యాయమూర్తి తన నిర్ణయం వెలువరించనున్నారు.

Related posts

చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు …సి ఐ డి కస్టడీకి అనుమతి ఇస్తూ సి ఐ డి కోర్టు అనుమతి …

Ram Narayana

రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారం.. స్టే విధించిన సుప్రీంకోర్టు

Ram Narayana

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడిపై అనర్హత వేటు వేసిన కర్ణాటక హైకోర్టు

Ram Narayana

Leave a Comment