Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు…

చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు…
హౌస్ అరెస్ట్ , ప్రత్యేక రూమ్ ఏర్పాటు ,ఇంటి భోజనపై తీర్పు వాయిదా…
విజయవాడ కోర్ట్ నుంచి రాత్రి 9 .30 గంటలకు రాజమండ్రికి
భారీ బందోబస్తు మధ్య రోడ్ మార్గంలో చంద్రబాబు

స్కీల్ డవలప్మెంట్ స్కాం లో ముద్దాయిగా గుర్తించిన విజయవాడ ఏ సి బి కోర్ట్ 14 రోజులు రిమాండ్ విధిస్తు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన జైలుకు వెళ్లని తప్పని పరిస్థితి ఏర్పడింది…నిన్న నంద్యాలలో అరెస్ట్ అయినదగ్గర నుంచి నేడు కోర్ట్ తీర్పు వెలువడేంతవరకు అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి… ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవితంలో ముద్దవిగా నిర్దారిస్తూ ఏ కోర్ట్ తీర్పు చెప్పలేదు …మొదటిసారిగా ఆయనపై పకడ్బందీగా కేసు నమోదు చేసిన సి ఐ డి పోలీసులు అనేక రకాలుగా నేరాన్ని పరిశోధించి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత షల్ కంపెనీల సృష్టించి తన సొంత అకౌంట్ లలోకి డబ్బులు తరలించుకున్నారని మోపిన అభియోగం పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్ట్ ఇందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్దారించుకొని చంద్రబాబుకు రిమాండ్ విధించింది…
చంద్రబాబు తరుపున సుప్రీం కోర్ట్ కు చెందిన ప్రముఖ లాయర్ సిద్దార్థ లూత్రా వాదించగా , సి ఐ డి తరుపున అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు . ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు వాదనలు సాగాయి. తీర్పు రాత్రి 7 గంటల తర్వాత వెలువడింది .. తీర్పు సందర్భంగా కోర్ట్ హాల్ లో కొద్దిమందికి మాత్రమే అనుమతించారు . అంతకు ముందే కోర్ట్ ప్రాగణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు …చివరకు సి ఐ డి వాదనలతో ఏకీభవించిన కోర్ట్ చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధిస్తు తీర్పు చెప్పింది…దీంతో టీడీపీ వర్గాలు కంగు తినగా , వైసీపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి…

చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని , లేదా హౌస్ అరెస్ట్ చెయ్యాలని ,రాజమండ్రి సెంట్రల్ జైలు లో ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేయాలనీ ,ఇంటి భోజనం ,మందులు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తరుపు లాయర్లు కోర్ట్ లో పిటిషన్ వేశారు దానిపై విచారణ జరిపిన కోర్ట్ రేపటికి వాయిదా వేసింది…దీంతో ఆదివారం రాత్రి విజయవాడలోనే ఉంటారని అనుకున్న చంద్రబాబును హుటాహుటిన రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు …

Related posts

స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు

Ram Narayana

వివేకా హత్య కేసు: అజేయ కల్లం పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు!

Ram Narayana

మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు…

Ram Narayana

Leave a Comment