జాతీయ వార్తలు

ఢిల్లీ లీక్కర్ కేసులో కీలక పరిణామం, అప్రూవర్‌గా మారిన రామచంద్రపిళ్లై!

  • సీఆర్పీసీ సెక్షన్ 164 కింద న్యాయమూర్తి ఎదుట అప్రూవర్‌గా మారినట్లు వార్తలు
  • ఇటీవలే ఆయన ఆస్తులను అటాచ్ చేసిన దర్యాఫ్తు సంస్థ
  • గతంలోను అప్రూవర్‌గా మారి, ఉపసంహరించుకున్న పిళ్లై

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దర్యాఫ్తు సంస్థ ఆయన ఆస్తులను ఇటీవల అటాచ్ చేసింది. పిళ్లై గతంలోను అప్రూవర్‌గా మారి, ఆ తర్వాత మాటమార్చారు. ఈడీ తన వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకుందని కోర్టుకు వెళ్లారు. ఆ వాంగ్మూలాలను వెనక్కి తీసుకున్నట్లు పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై రామచంద్రపిళ్లైని ఈ ఏడాది మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది.

Related posts

బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు…

Ram Narayana

పశ్చిమాసియా యుద్ధం.. రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం…

Ram Narayana

రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేలు.. కేంద్ర పథకం వివరాలు!

Ram Narayana