- సెప్టెంబర్ 26 వరకు కవితకు సమన్లు జారీ చేయొద్దని సుప్రీం ఆదేశాలు
- కవితకు ఇష్టమయినప్పుడు వెళ్లాలని కోర్టు చెప్పిందని ఎద్దేవా
- మోదీ ఆదేశాలు లేకుండా ఇలా జరుగుతుందా అని ప్రశ్న
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఇచ్చిన సమన్లను సుప్రీంకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 26 వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విచారణకు రావాలని ఈడీ సమన్లు పంపిస్తే… కవితకు ఇష్టమయినప్పుడు వెళ్లాలని కోర్టు చెప్పిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను బిజీగా ఉన్నానని కవిత చెప్పగానే కోర్టు నమ్మేసిందని అన్నారు. ప్రధాని మోదీ ఆదేశాలు లేకుండా ఇలా జరుగుతుందా? అని ప్రశ్నించారు.
కవిత తనకు చాల బిజీ ఉందని చెప్పడం వెంటనే కోర్ట్ అంగీకరించడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు . మోడీ అండ లేకుండా కవిత కు కోర్ట్ మినహాయింపు ఇస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు . ఒక వ్యక్తిపై ఆరోపణలు వస్తే వాటిని పరిశీలించిన సంబంధిత ప్రభుత్వ ఏజన్సీలు విచారణ జరిపి ప్రాధమికంగా నిర్దారణ జరిపి ఆధారాలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఈడీ ముందు హాజరు కావడంలోజరుగుతున్నా తంతు ఒక ప్రవాసానంగా ఉందని ఇది మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉందని అభిప్రాయపడ్డారు .