Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ముందు వైసీపీని ఓడించాలి.. ఆ తర్వాతే రాజు ఎవరో, మంత్రి ఎవరో ఆలోచిద్దాం: పవన్ కల్యాణ్

  • మంగళగిరిలో జనసేన పార్టీ  విస్తృత స్థాయి సమావేశం
  • జగన్ మానసిక పరిస్థితి బాగాలేదని వ్యంగ్యం
  • కేంద్రం మానసిక వైద్యులను పంపాలని 
  • జగన్ పరిస్థితి ఏ డాక్టర్ ను అడిగినా ఇదే చెబుతారని వెల్లడి

జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ది ధైర్యం అనుకుంటారని, కానీ అది పిచ్చ అని వ్యాఖ్యానించారు. జగన్ మానసిక స్థితి బాగాలేదని, కేంద్రం ప్రత్యేక మానసిక వైద్యులను పంపించాలని వ్యంగ్యం ప్రదర్శించారు. పవన్ ఇవాళ మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ మానసిక స్థితి బాగా లేదని ఏ డాక్టర్ ను అడిగినా ఇదే చెబుతారని వెల్లడించారు. 

“ఇంట్లోంచి బయటికి రాలేడు, ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు, ఆఖరికి నన్ను తిట్టాలన్నా కూడా పేపర్ పదిసార్లు చదివి తిడతాడు. జపాన్ ప్రభుత్వాన్ని కూడా ఇరిటేట్ చేయగలిగిన మహానుభావుడు జగన్” అని ఎద్దేవా చేశారు. 

ఇక జగన్ చాలా క్రూరమైన వ్యక్తి అని అతడి సన్నిహితులు తనకు చెప్పారని పవన్ వెల్లడించారు. అయితే, గడాఫీ, సద్దాం హుస్సేన్ వంటివారు కూడా ఇలానే అనుకున్నారు… కానీ వాళ్లు ఏమయ్యారో మీకు తెలుసు అని వ్యాఖ్యానించారు. 

పవర్ షేరింగ్ విషయం నాకు వదిలేయండి!

పవర్ షేరింగ్ విధానంతో, 2024 ఎన్నికల్లో బలమైన స్థానాలతో జనసేన పార్టీ బరిలో దిగుతుంది. ఎన్ని స్థానాలు అనేది నాకు వదిలేయండి. పవర్ షేరింగ్ విషయం నేను చూసుకుంటాను. ముందు మనం వైసీపీని ఓడించాలి. ఆ తర్వాత రాజు ఎవరో, మంత్రి ఎవరో ఆలోచిద్దాం. ఇప్పుడు అనవసరమైన చర్చలు వద్దు. పొత్తులకు సంబంధించి సమన్వయ కమిటీకి నాదెండ్ల మనోహర్ గారిని అధ్యక్షుడిగా నియమిస్తున్నాను. 2009లో కన్న కలలను 2024లో మనం సాకారం చేద్దాం.

Related posts

వైసీపీకి గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు..సంతోషంగా ఉందన్న టీడీపీ

Ram Narayana

ఏపీసీసీ చీఫ్ గా షర్మిల భాద్యతలు … చంద్రబాబు ,జగన్ లపై బాణాలు …

Ram Narayana

చంద్రబాబు అరెస్ట్ …పవన్ కళ్యాణ్ హంగామా …అడ్డగించిన పోలీసులు …

Ram Narayana

Leave a Comment