Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం కాంగ్రెస్ లో తిరుగుబాటా …?సర్దుబాటా …??కీం కర్తవ్యం

ఖమ్మం కాంగ్రెస్ లో తిరుగుబాటా …?సర్దుబాటా …??కీం కర్తవ్యం
కాంగ్రెస్ లో అసమ్మతి …పాత,కొత్త కాంగ్రెస్ నేతల మధ్య సీట్ల పేచీ
సీట్లు ఆశించి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నేతల సమాలోచనలు
పార్టీ కార్యకర్తలను రక్షించుకున్న తమకు సీట్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని ఘీంకరింపులు
అన్ని సర్దుకుంటాయంటున్నా సీనియర్లు

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుంచి బలమైన నేతలు చేరడంతో హస్తం పార్టీ ఓవర్ ఫ్లో అయింది…రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే చేరిన వారికీ సీట్లు కేటాయించాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది… దీంతో పాత కొత్త నేతలమధ్య సీట్ల పేచీ నెలకొన్నది …కొత్తగా వచ్చిన వారికీ సీట్లు ఇస్తే తాము సహకరించేది లేదని ఖరాకండిగా చెపుతున్నారు . ఒక రకంగా చెప్పాలంటే ఘీంకరిస్తున్నారు …. ఇది కాంగ్రెస్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది… ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉండి పనిచేస్తూ అనేక కష్టనష్టాలకు ఓర్చిన తమకు సీట్లు కేటాయించాలని పట్టుబడుతున్నారు . అందులో న్యాయం ధర్మం ఉందని అభిప్రాయపడుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారికీ నచ్చచెపుతారా …తిరుగుబాటు లేకుండా సర్ది చెపుతారా ..? లేదా …? అనేది ఆసక్తిగా మారింది…

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు ఉండగా అందులో కేవలం మూడు మాత్రమే జనరల్ సీట్లు ….దీంతో ఈసీట్లకు డిమాండ్ తీవ్రంగా ఉంది… మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు …ఆయన పాలేరు లేదా ఖమ్మంలో పోటీచేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది…ఆయనకు ఇష్టమైన సీటు పాలేరు దానిపై రాయల ఆశలు పెట్టుకున్నారు …ఇక మరో ముఖ్యనేత మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మూడు జనరల్ సీట్లకు దరఖాస్తు చేసుకున్నారు .ఆయనతోపాటు ఆయన అనుయాయులు దరఖాస్తులు చేసుకున్నారు .ఎవరికీ ఎక్కడ సీటు అనేదానిపై కసరత్తులు జరుగుతున్నాయి. సునీల్ కొనుగోలు టీం ఎప్పటికప్పుడు నియోజకవర్గాల పరిస్థితిపై సర్వేలు చేయిస్తూ నేరుగా పార్టీ అధిష్టానానికి నివేదికలు అందజేస్తుంది…సర్వేల ఆధారంగానే టిక్కెట్ల పంపిణి జరుగుతుందని పార్టీ పెద్దలు చెపుతున్నారు …

అసమ్మతి రాగాలు …రహస్య సమాలోచనలు

పార్టీనేతల్లో అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి.. రహస్య సమావేశాలు జరుగుతున్నాయి..నిన్నమొన్నటివరకు తమ నేతకు టికెట్ వస్తుందని అనుకున్న అనుయాయులు సైతం కాంగ్రెస్ రాష్ట్రనేతల వైకరిపై గుర్రుగా ఉన్నారు … పాలేరు సీటు బలంగా ఆశిస్తున్నా రాయల నాగేశ్వరరావు ,కొత్తగూడం సీటు ఆశిస్తున్న పోట్ల నాగేశ్వరరావు ,ఖమ్మం సీటు ఆశిస్తున్న జావేద్ కొత్తగూడెం సీటు ఆశిస్తున్న ఎడవల్లి కృష్ణ , అశ్వారావుపేట కోరుతున్న తాటి వెంకటేశ్వర్లు , ఇల్లందు ఆశిస్తున్న డాక్టర్ రవినాయక్ ,వైరా సీటు కోరుతున్న బాలాజీ నాయక్ ,రాందాస్ నాయక్ లు అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తు చేసుకున్నారు . కానీ కొత్తగా చేరుతున్న నాయకులకే టికెట్స్ అని ప్రచారం జరుగుతుండటంతో పార్టీ నేతల ఆలోచనలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు .ఇటీవల ఖమ్మం వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడి ముందే కాంగ్రెస్ జిల్ల్లా కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జరిగిన సమావేశంలో బల ప్రదర్శన చేశారు .నినాదాలు ఇచ్చారు . సంవత్సర కాలం క్రితం నుంచే టికెట్ ఆశిస్తూ ఆయా నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్ననేతలలు సమాలోచనలు జరుపుతున్నారు . తమకు కాకుండా మరెవరికో టికెట్స్ ఇస్తామంటే మరి మేమెందుకు అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు . శనివారం రాయల నాగేశ్వరరావు అనుయాయులు సమావేశమై రాష్ట్ర నేతలతో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు . ఈ పరిణామాలను బీఆర్ యస్ పార్టీ నిశితంగా గమనిస్తుంది…ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ యస్ ఎన్నికల షడ్యూల్ రాకముందే ఎన్నికల ప్రచారంలోకి దిగింది…. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10 కి పది స్థానాలు మావే అని చెపుతున్నప్పటికీ పాతకొత్త నాయకుల మధ్య నెలకొన్న వైరుధ్యాలను రాష్ట్ర నాయకత్వం పరిస్కరిస్తుందా …లేక చేతులెత్తేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది….. చూద్దాం ఏంజరుగుతుందో ….!

Related posts

ఖమ్మం మార్కెట్లోకి ఒకే రోజు బజాజ్ సిఎన్జి బైకులు, మహేంద్ర తార్ రాక్స్ వాహనాలు విడుదల! .

Ram Narayana

చెరువుమాదారంలో గోడకూలి దంపతుల మృతి…స్పందించిన పొంగులేటి, కుటుంబసభ్యులకు రూ లక్ష సహాయం…

Ram Narayana

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Ram Narayana

Leave a Comment