Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్‌లోని కెనడా దౌత్యవేత్తకు భారత్ ఆదేశాలు

  • హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తముందని కెనడా ఆరోపణ
  • కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు
  • తీవ్రంగా స్పందించిన భారత్… కెనడా దౌత్యవేత్త పై   వేటు

ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తముందని కెనడా ఆరోపించడంతో పాటు తమ దేశంలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేసింది. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ చర్యను ఖండించిన భారత్… కెనడాకు బదులిచ్చింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు మన విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్‌కు కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్‌కేకు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.

ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి కామెరూన్ ఈ రోజు ఉదయం చేరుకున్నారు. ఈ సందర్భంగా దౌత్యవేత్తను బహిష్కరిస్తున్న విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ఐదు రోజుల్లో దౌత్యవేత్త దేశాన్ని విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా బహిష్కరించినట్లు తెలిపింది. ఈ అంశంపై విలేకరులతో మాట్లాడేందుకు కామెరూన్ నిరాకరించారు.

Related posts

భారత్ కొన్ని లక్షల మందిని కష్టాలపాలు చేస్తోంది..కెనడా ప్రధాని ఆరోపణ

Ram Narayana

11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడపగా పక్కనే మందుకొట్టిన తండ్రి.. కూలిపోయిన విమానం

Ram Narayana

ఫ్యామిలీ మెంబర్ స్పాన్సర్ వీసాకు ఆదాయ పరిమితిని 55 శాతం పెంచిన యూకే…

Ram Narayana

Leave a Comment