Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు …సి ఐ డి కస్టడీకి అనుమతి ఇస్తూ సి ఐ డి కోర్టు అనుమతి …

  • స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
  • సీఐడీ తరపు వాదనలను సమర్థించిన హైకోర్టు
  • కాసేపట్లో చంద్రబాబు కస్టడీపై తీర్పును వెలువరించనున్న ఏసీబీ కోర్టు
  • పోలీస్ కస్టడీ ఎక్కడ ఎప్పటినుంచి ప్రారంభిస్తారు …

చంద్రబాబు అరెస్ట్ అక్రమమని కేసుకు ఎలాంటి సంబంధం లేకుండా న్యాయసూత్రాలను ఉల్లఘించి చంద్రబాబుపై ఆక్రమ కేసు పెట్టారని అందువల్ల ఆయనపై పెట్టిన కేసును కొట్టివేయాలని వేసిన కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.అదే సందర్భంలో సి ఐ డి పోలీసులు కస్టడీకి అనుమతి ఇస్తూ సి ఐ డి ఉత్తర్వలు జారీచేసింది….ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తితంగా సంచలనంగా మారింది…దీనిపై ఇటు తెలుగుదేశం ,అటు సి ఐ డి లు ఢిల్లీలో పెద్ద ఎత్తున తమ వాదనలు టీవీ ఛానళ్లలో వినిపించారు . ఇరుపక్షాలు సుప్రీం కోర్ట్ లాయర్లను పెట్టి కేసును వాదించారు . ఎవరు వాదనలు వారు వినిపించడంతోపాటు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశించారు .

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి కేవలం ఒకే ఒక వాక్యంతో తీర్పును వెలువరించారు. ‘ది పిటిషన్ ఈజ్ డిస్ మిస్డ్’ అని చెప్పి, బెంచ్ దిగి జడ్జి వెళ్లిపోయారు. స్కిల్ కేసులో సీఐడీ వినిపించిన వాదనలను హైకోర్టు సమర్థించింది. 

స్కిల్ స్కాం కోసులో చంద్రబాబు అరెస్ట్ అక్రమమని సెక్షన్ 17 ఏ ప్రకారం అది చెల్లదని చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రహించారు …దీనిపై రెండు రోజులు హోరా హోరి వాదనలు జరిగాయి..సుప్రీం కోర్ట్ కు చెందిన ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే ,సిద్దార్ధ లూథ్రా ,సిద్దార్థ అగర్వాల్ ,సి ఐ డి తరుపున ప్రముఖ లాయర్ ముఖుల్ రోహిత్గీ వాదించారు . వీరి వాదనలు చాల హాట్ హాట్ గా జరిగాయి. దీంతో చంద్రబాబు నేరం చేశాడా లేదా అని విషయం పక్కకు పోయింది . ఆయన సీఎంగా ఉండగా ఈకేసు అయిందనున గవర్నర్ అనుమతి లేకుండా ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని చంద్రబాబు తరుపున లాయర్ లు వాదించారు . సి ఐ డి సుమారు 700 పేజీల రిపోర్ట్ హైకోర్టు కు సమర్పించగా , చంద్రబాబు తరుపున ఈకేసులో సంబంధంలేదని 900 పేజీల రిపోర్ట్ సమర్పించడం గమనార్హం …

ఇప్పుడు చంద్రబాబును పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఎక్కడ విచారిస్తారు …ఆయన నుంచి ఏమి విషయాలు రాబడతారు అనేది ఆశక్తిగా మారింది ..

చంద్రబాబు కస్టడీ నేపథ్యంలో సీఐడీకి జడ్జి విధించిన కండిషన్స్ ఇవే!

  • చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు
  • విచారణ ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదని ఆదేశం
  • చంద్రబాబు లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలని కండిషన్
ACB Court conditions to CID for Chandrababu custody

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పును వెలవరించింది. ఈ సందర్భంగా సీఐడీకి ఏసీబీ కోర్టు జడ్జి పలు కండిషన్లను విధించారు. 

ఏసీబీ కోర్టు జడ్జి కండిషన్స్:

  • విచారణ ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదు
  • విచారణ వివరాలను మీడియాకు వెల్లడించకూడదు
  • కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో ఇవ్వాలి
  • విచారణ అధికారుల వివరాలు ఇవ్వాలి
  • చంద్రబాబును ఆయన లాయర్ల సమక్షంలోనే విచారించాలి
  • చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
  • చంద్రబాబు ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
  • చంద్రబాబు విచారణను తాము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం
  • కస్టడీ మగిసిన వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలి.

మరోవైపు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తామని కోర్టుకు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు.

Related posts

దేవినేని, నల్లారి లను సోమవారం వరకు అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు తెలిపిన ఏఏజీ

Ram Narayana

తనపై అనర్హతను తిరిగి విచారించాలని హైకోర్టు లో వనమా పిటిషన్ …స్వీకరించిన న్యాయస్థానం

Ram Narayana

అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో సీఎం జగన్ కు ఎదురుదెబ్బ

Ram Narayana

Leave a Comment