Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ పై దృష్టి పెట్టండి సార్….మహానాడులో చంద్రబాబును కోరిన టీటీడీపీ నేతలు

తెలంగాణ పై దృష్టి పెట్టండి సార్
– మహానాడులో చంద్రబాబును కోరిన టీటీడీపీ నేతలు
-బడుగు, బలహీన వర్గాలు మనవైపే చూస్తున్నాయి
-కేసీఆర్ పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారు
-పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయం
తెలంగాణ లో పార్టీ బలోపేతానికి దృష్టిపెట్టండి సార్ ప్రజలు మనవైపే ఉన్నారు.టీఆర్ యస్ విసుగుచెందారు. బడుగు బలహీన వర్గాలు మనపాలన గురించే చెప్పుకుంటున్నారు అని పలువురు టీటీడీపీ నేతలు మహానాడు వర్చువల్ మీటింగ్ సాక్షిగా అధినేత చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. అసలే ఆంధ్ర లో పార్టీపై సతమతమౌతున్న వేళ తెలంగాణ నేతల అభ్యర్థన విచిత్రంగా ఉండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కేసీఆర్ పాలనతో తెలంగాణ ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారని, ఇక్కడి ప్రజలు మళ్లీ టీడీపీవైపు చూస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. కాబట్టి తెలంగాణను కూడా పట్టించుకోవాలని అధినేత చంద్రబాబుకు సూచించారు. నిన్న ప్రారంభమైన టీడీపీ మహానాడులో టీటీడీపీ నేతలు మాట్లాడుతూ ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

టీడీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలు మనవైపే చూస్తున్నారని నేతలు దుర్గాప్రసాద్, జ్యోజిరెడ్డి, కృష్ణమోహన్, అరవింద్ కుమార్ గౌడ్, తాజొద్దీన్ తదితరులు పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ టీడీపీకి ఉన్న స్థానం ఎప్పటికీ ప్రత్యేకమైనదని, పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయమని తాజొద్దీన్ పేర్కొన్నారు.

Related posts

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితాలు: ఏడో రౌండ్‌లోనూ ఈట‌ల‌దే హ‌వా!

Drukpadam

నోటీసులకు భయపడను: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్….

Drukpadam

అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన‌ ప్ర‌జ‌ల‌ను చీట్ చేయ‌కూడదు: మేకపాటి రాజమోహన్ రెడ్డి!

Drukpadam

Leave a Comment