Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఇది పాకిస్థాన్ బోర్డర్ కాదంటూ వీడియోను పోస్టు చేసిన టీడీపీ.. వందలాదిమంది పోలీసులతో పహరా!

  • చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
  • అడ్డుకునేందుకు రాత్రి నుంచే గరికపాడు వద్ద భారీ ఎత్తున పోలీసుల మోహరింపు
  • పోలీసులను దింపి తాడేపల్లి పిల్లి భయపడుతూ ప్యాలెస్‌లో పడుకుందని టీడీపీ ఎద్దేవా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి చేపట్టిన ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ ర్యాలీపై ఆంక్షలు విధించిన పోలీసులు ఏపీ సరిహద్దు గరికపాడు వద్ద శనివారం రాత్రి నుంచే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వచ్చే ప్రతీ వాహనాన్ని పూర్తిగా తనఖీ చేసిన తర్వాతే విడిచిపెడుతున్నారు.

గరికపాడు వద్ద భారీగా మోహరించిన పోలీసుల వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన తెలుగుదేశం పార్టీ.. ‘ఇది పాకిస్థాన్ బోర్డర్ కాదు.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు’ అని క్యాప్షన్ తగిలించింది. చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న ఐటీ ఉద్యోగులకు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదంటూ వందలాదిమంది పోలీసులను సరిహద్దు వద్ద మోహరించి.. తాడేపల్లి పిల్లి మాత్రం ప్యాలెస్‌లో భయపడుతూ పడుకుందని ఎద్దేవా చేసింది.

చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రి జైలుకు ఉత్తరాల వెల్లువ

  • ‘బాబుతో నేను’ అంటూ వేలల్లో పోస్టు కార్డులు
  • నాలుగు రోజులుగా ఉత్తరాలు రాస్తున్న అభిమానులు
  • రాష్ట్రం నలుమూలల నుంచి పోస్టు కార్డుల ఉద్యమం
Post Card Movement in support to chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ గొంతెత్తుతున్నారు. ప్రజలు తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్రంతో పాటు దేశవిదేశాల్లోనూ నిరసనలు చేస్తున్నారు. టీడీపీ అధినేతను ఉంచిన రాజమండ్రి కారాగారానికి నాలుగు రోజులుగా రోజూ వేలల్లో ఉత్తరాలు వస్తున్నాయి. ‘బాబుతో నేను’ అంటూ ప్రజలు పోస్టుకార్డులు రాసి పంపుతున్నారు. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ లతో పాటు ఆర్డినరీ పోస్టులో నిత్యం వేలాదిగా ఉత్తరాలు వస్తున్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు.

చంద్రబాబుకు మద్దతుగా ఈ నెల 16 నుంచి పోస్టుకార్డుల ఉద్యమం మొదలుకాగా.. ఈ నెల 20న రాజమండ్రి జైలుకు 2,150 ఉత్తరాలు వచ్చాయని సమాచారం. ఈ నెల 21న 6,250, శుక్రవారం 8,340 కార్డులు, శనివారం ఏకంగా 23,570 పోస్టుకార్డులు అందినట్లు తెలుస్తోంది. వీటికి అదనంగా నాలుగు రోజుల్లో స్పీడ్ పోస్టులో 60 ఉత్తరాలు, రిజిస్టర్డ్ పోస్టులో 90 ఉత్తరాలు, ఆర్డినరీ పోస్టులో 300 ఉత్తరాలు రాజమండ్రి కారాగారానికి చేరినట్లు అధికారులు వెల్లడించారు.

Related posts

ఏపీలో ఈ సారి ఎన్నికలు అంత ఈజీగా ఉండవు: బాలినేని

Ram Narayana

షర్మిల సవాల్ కు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సై…!

Ram Narayana

సలహాదారు పదవులకు సజ్జలతో సహా మరో 20 రాజీనామా …

Ram Narayana

Leave a Comment