Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

మరో 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

  • ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభోత్సవం
  • తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి మరో రెండు రైళ్లు
  • కాచిగూడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశవ్యాప్తంగా మరో తొమ్మిది వందేభారత్ రైళ్లు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ఢిల్లీ నుంచే ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు ఆదివారం కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన వందేభారత్ రైలు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హయాంలో రైల్వే శాఖలో నూతన శకం ప్రారంభమైందని చెప్పారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధితో పాటు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నామని వివరించారు. తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాగా తాజాగా మరో రెండు రైళ్లను మోదీ ప్రారంభించారని వివరించారు. కాచిగూడ, బెంగళూరుల మధ్య ఒకటి, విజయవాడ చెన్నై మధ్య మరొక వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు పెడతాయని కిషన్ రెడ్డి చెప్పారు.

Related posts

మోదీకి అచ్చే దిన్ పూర్తయ్యాయి: శత్రుఘ్న సిన్హా..

Drukpadam

ప్రధాని మోదీ డిగ్రీపై వ్యాఖ్యలు… కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు…

Ram Narayana

సైబర్ దాడి జరుగుతోందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఊమెన్ చాందీ కూతురు

Ram Narayana

Leave a Comment