Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

చంద్రబాబు రిమాండ్ అక్టోబర్ 5 వరకు పొడిగింపు…రేపు సి ఐ డి కోర్టులో బెయిల్ పై విచారణ ..!

చంద్రబాబు రిమాండ్ అక్టోబర్ 5 వరకు పొడిగింపు…రేపు సి ఐ డి కోర్టులో బెయిల్ పై విచారణ ..!
రెండు వారాల క్రితం చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ
నేడు వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అధికారులు
చంద్రబాబు రిమాండ్‌ను మరో 11 రోజులు పొడిగించిన న్యాయమూర్తి
విచారణ సందర్భంగా సి ఐ డి అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారని అని ఆరా తీసిన జడ్జి

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం ఆదివారం పొడిగించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయన రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు అంటే మరో 11 రోజులు పొడిగించారు. స్టడీ కూడా ఈరోజు ముగియడంతో ఈ కేసులో మరిన్ని వివరాల రాబట్టేందుకు మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరింది.

ఈ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించింది. కస్టడీ కూడా ఈరోజు ముగియడంతో ఈ కేసులో మరిన్ని వివరాల రాబట్టేందుకు మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరింది. చంద్రబాబును రెండురోజుల పాటు 12 గంటలకు పైగా విచారించిన సీఐడీ 120 ప్రశ్నలు సంధించింది.

చంద్రబాబును ఏసీబీ న్యాయమూర్తి ఏం అడిగారంటే!?
సీఐడీ విచారణ సందర్భంగా వైద్య పరీక్షల నిర్వహణపై జడ్జి ఆరా
రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపడతామన్న న్యాయమూర్తి

మీ బెయిల్ పిటిషన్‌ను రేపు సోమవారం విచారిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏసీబీ న్యాయమూర్తి చెప్పారని తెలుస్తోంది. ఈ రోజు కస్టడీ, రిమాండ్ ముగిసిన నేపథ్యంలో సీఐడీ అధికారులు… చంద్రబాబును వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రెండురోజుల కస్టడీ ముగియడంతో విచారణ అధికారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతున్నట్లు చెప్పారని తెలుస్తోంది.

విచారణ సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించారా? ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వైద్య పరీక్షలు నిర్వహించారని, తనను ఏవిధంగా ఇబ్బంది పెట్టలేదని చెప్పారు.

ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి జడ్జి మాట్లాడుతూ… రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామన్నారు. విచారణ సందర్భంగా ఏం గుర్తించారో బయట పెట్టాలని ఈ సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి చేయగా, న్యాయమూర్తి స్పందిస్తూ… వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను మీ న్యాయవాది నుంచి తీసుకోవాలని జడ్జి సూచించారు.

Related posts

ఓ వ్యక్తికి 383 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోయంబత్తూర్ కోర్టు.. ఆయన చేసిన నేరం ఏమిటంటే..?

Ram Narayana

పెళ్లి చేసుకోకున్నా సహజీవన భాగస్వాగస్వామికి భరణం చెల్లించాల్సిందే.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

Ram Narayana

బ్యాలట్ పేపర్లో కొండా విశ్వేశ్వరరెడ్డికి కొత్త చిక్కు …అదే పేరుతో మరో ఇద్దరు ..

Ram Narayana

Leave a Comment