Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు నిరాశ.. విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసిన ధర్మాసనం

  • చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు
  • బాబు తరపున వాదనలు వినిపించిన లూథ్రా
  • రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదననలు వినిపించారు.

ఈ పిటిషన్ తొలుత జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టి ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే, విచారణ నుంచి జస్టిన్ ఎస్వీ భట్టి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన నాట్ బిఫోర్ మీ తీసుకున్నారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సీజేఐ ముందు సిద్ధార్థ్ లూథ్రా మళ్లీ మెన్షన్ చేశారు. పిటిషన్ ను తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు. త్వరగా లిస్ట్ చేయాలనేది తమ మొదటి అభ్యర్థన అని, చంద్రబాబుకు మధ్యంతర ఉపశమనం కలిగించాలనేది రెండో అభ్యర్థన అని లూథ్రా విన్నవించారు. 

17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని లూథ్రా చెప్పారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. పోలీసు కస్టడీ నుంచి మినహాయింపు కోరుతున్నామని చెప్పారు. ఇప్పటికే రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసిందని, మరో 15 రోజుల కస్టడీకి కోరుతున్నారని చెప్పారు. జెడ్ కేటగిరీ, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ఎలా ట్రీట్ చేస్తారని ప్రశ్నించారు. ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని చెప్పారు. యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలను పొందుపరిచారని తెలిపారు. 

సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా ప్రభుత్వం తరపు న్యాయవాది రంజిత్ కుమార్ కల్పించుకున్నారు. అయినప్పటికీ లూథ్రా వాదనను సీజేఐ పూర్తిగా విన్నారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో వరుస కేసులు వేస్తున్నారని చెప్పారు. తక్షణమే చంద్రబాబుకు ఉపశమనం కలిగించాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న సీజేఐ డీవై చంద్రచూడ్… కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో 3వ తేదీకి వాయిదా వేస్తున్నామని. వచ్చే మంగళవారం వాదనలు వింటామని చెప్పారు.

రింగ్ రోడ్డు కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను వాయిదా వేసిన హైకోర్టు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈరోజు సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టుల్లో తీవ్ర నిరాశ ఎదురయింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, మాజీ మంత్రి పి.నారాయణ తదితరులు కూడా నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నారా లోకేశ్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

సుప్రీంలో చంద్రబాబు పిటిషన్‌: ‘నాట్ బిఫోర్ మీ’ అన్న జస్టిస్ ఎస్వీఎన్ భట్టి.. విచారణ వాయిదా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు బ్రేక్ పడింది! ఇటీవల చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ ప్రారంభానికి ముందు… ద్విసభ్య బెంచ్ విచారణకు విముఖత చూపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారణకు మొగ్గు చూపలేదు. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ మీ అని చెప్పడంతో ఈ పిటిషన్ విచారణ మరో బెంచ్‌కు బదలీ అయ్యే అవకాశముంది.

విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విముఖత చూపడంతో చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అర్జంట్‌గా కేసును విచారించాలని చంద్రబాబు లాయర్లు కోరినప్పటికీ ద్విసభ్య బెంచ్ మొగ్గు చూపలేదు. రేపు, ఎల్లుండి కోర్టుకు సెలవుల నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ వచ్చే వారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు కొంత నిరాశను, ఇదే సమయంలో కొంత ఉపశమనాన్ని కలిగించింది. చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ రాకపోవడం చంద్రబాబుకు నిరాశను కలిగిస్తే… సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కూడా వాయిదా వేయడం ఆయనకు కొంత ఉపశమనాన్ని కలిగించే అంశమే. అక్టోబర్ 4వ తేదీ వరకు సీఐడీ అధికారుల విచారణను ఆయన ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబుకు నిరాశే ఎదురయింది.  

Related posts

చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్

Ram Narayana

తనపై అనర్హతను తిరిగి విచారించాలని హైకోర్టు లో వనమా పిటిషన్ …స్వీకరించిన న్యాయస్థానం

Ram Narayana

సుప్రీంకోర్టులో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఊరట

Ram Narayana

Leave a Comment