Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

హరి ప్రియ వద్దే వద్దు … హరీష్ వద్దకు అసమ్మతి నేతలు …

హరి ప్రియ వద్దే వద్దు … హరీష్ వద్దకు అసమ్మతి నేతలు …
ఇల్లందు బీఆర్ యస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న మున్సిపల్ చైర్మన్ వర్గం
నియోజకవర్గ ఇంచార్జి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నియోజకవర్గంలో పర్యటిస్తున్న రోజునే అసమ్మతి నేతలు హైద్రాబాద్ కు …
హరిప్రియను మార్చాల్సిందే అంటూ వైరి వర్గం పట్టు
ససేమిరా అంటున్న పార్టీ అధినేతలు

ఇల్లందు బీఆర్ యస్ అభ్యర్థిగా తిరిగి హరిప్రియను ప్రకటించడాన్ని మున్సిపల్ చైర్మన్ , ఇల్లందు ఎంపీపీ వ్యతిరేకిస్తున్నారు . హరిప్రియను మార్చాల్సిందే అని అంటున్నారు . ఈ నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించిన రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేశారు . సయోధ్య కుదిరింది అనుకున్న మరోసటీ రోజునుంచే మళ్ళీ అదేతీరుతో అక్కడ అసమ్మతి కొనసాగుతుంది. దీంతో ఇల్లందు పంచాయతీ ముదిరి పాకాన పడ్డది. బీఆర్ఎస్ లో రోజురోజుకీ అసమ్మతి తారాస్థాయికి చేరుతుంది. ఇప్పటికే ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ కు టికెట్ ఇవ్వొద్దంటూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గం ప్రజల్ని దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అదే పంచాయతీ మళ్ళీ మొదటికి వచ్చింది. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తో పాటు ఎంపీపీ చీమల నాగరత్నం, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పులిగళ్ల మాధవరావు మరికొందరు నాయకులతో కలిసి శుక్రవారం హైదరాబాదు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుతో కలిసి తమ గోడును వెల్లబుచ్చుకునేందుకు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిన జాబితాలో ఇల్లందు ప్రస్తుత ఎమ్మెల్యే హరిప్రియ పేరు ఉండటంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకులు జీర్ణించుకోలేక పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే హైదరాబాదు వెళ్లి అధిష్టానాన్ని కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అభ్యర్థిని వ్యతిరేకించే నాయకులంతా కాంగ్రెస్ నాయకులతో తిరుగుతూనే మళ్లీ టిఆర్ఎస్ నాయకులతో మంతనాలు చేసేందుకు ప్రయత్నం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది . ఇప్పటికే మున్సిపాలిటీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. దానిని తప్పుదోవ పట్టించేందుకు మరో దోవ ఎన్నుకున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. హైదరాబాదులో మంత్రి హరీష్ రావు తో చర్చలు జరిపాక అసలు విషయం వెలుగులోకి వస్తుందని స్థానిక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. శనివారం మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఒక రోజు ముందు ఇల్లేందు పంచాయతీ మరోసారి బహిర్గతం కావడం గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తుంది ….

Related posts

కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఎవరు …? రేవంత్ రెడ్డి ,భట్టి పేర్ల పరిశీలన …!

Ram Narayana

దోపిడీ పాలకులను తెలంగాణ నుంచి తరిమికొట్టాలి: మల్లు భట్టి

Ram Narayana

ఎన్నికల్లో పోటీ చేయడంపై నాపై ఒత్తిడి ఉన్న మాట నిజమే: తెలంగాణ నేతలతో పవన్ కల్యాణ్

Ram Narayana

Leave a Comment