Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మీడియా రంగాన్ని రక్షించుకోకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది..ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది రాకేశ్ కన్నా

మీడియాకు రక్షణచట్టం -మీడియా కమీషన్ ఏర్పాటు తక్షణ అవసరం

నిజాన్ని బయట పెట్టడంలో మీడియా పాత్రకీలకం

ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సోషల్ మీడియాను విస్మరించలేము…

ప్రధాని మోడీ కూడ యూ ట్యూబ్ చానల్ పెట్టుకున్నారు.

సమాచార విస్పోటనం జరుగుతున్న ప్రస్తుత తరణంలో మీడియారంగాన్ని రక్షించుకోకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలుతుందని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది రాకేశ్ కన్నా అభిప్రాయపడ్డారు. మీడియా రక్షణకు చట్టం ,మీడియా కమీషన్ ఏర్పాటుకు పాలకులపై వత్తిడి పెంచేందుకు ఇదే సరైన తరణమన్నారు. ఇందుకు ఐజేయూ చేస్తున్న కృషిని అభినందించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజాస్వామ్య పరిరక్షకులుగా , జర్నిలిస్టులు చేస్తున్న సాహసోపేతమైన వృత్తి ధర్మం అభినందనీయమన్నారు… దేశరాజధాని న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆద్వర్యంలో జర్నలిస్టులకు రక్షణ చట్టంమీడియా కమీషన్ ఏర్పాటు ఆవశ్యకతపై జరిగిన సెమినార్ కు ఖన్నా ప్రధాన వక్తగా హజరై ప్రసంగించారు. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టేందుకు మీడియా చేస్తున్న కృషిని విస్మరించరాదన్నారు. క్రమంలో జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులు ,హత్యలు,మాఫియా గ్యాంగ్ బెదిరింపులు ఆందోళనకరమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జర్నలిస్ట్ లకు తగిన భద్రత కల్పించాలాన్నారు. స్వాతంత్ర్య భారత్ లో సైతం మీడియా అణిచివేతకు గురికావడం సిగ్గుచేటున్నారు. ప్రజాస్వామ్యంలో మిగిలిన మూడు స్తంభాలకు రక్షణ ఉన్నా నాల్గొవ స్థంభంగా ఉన్న మీడియాకు రక్షణ లేకపోతే ప్రమాదమన్నారు. పాకిస్థాన్ లాంటిదేశంలో వార్తలసేకరణకు గోప్యత ఉంటుందన్నారు. అది మనదేశంలో లేవకపోవడం విచారకరమన్నారు.

సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందిందని యూట్యూబ్ చానల్స్ డిజిటల్ మీడియా ప్రాదాన్యత సంతరించుకున్న ప్రస్తుత తరణంలో రాసే వార్తలు విశ్వసనీయత ,ప్రజల ప్రయోజనాలు గీటురాయిగా ఉండాలన్నారు. ప్రధాని మోడీ సైతం మాన్ కీ బాత్ తో పాటు సొంత యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పటికీ మీడియా ప్రయోజనాలు ప్రధానంగా జర్నలిస్టుల ప్రయోజనాలు నేరవెర్చడంలో దంతాలు లేని నోరుగా మారిందని అన్నారు. అందుకోసమే జర్నలిస్టుల రక్షణకోసం రక్షణ చట్టం తేవడంతో పాటు మీడియా స్వేచ్ఛకోసం మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని ఐజేయూ కోరడం సమంజసమైనదేనని అభిప్రాయపడ్డారు .

ఇది మూడు స్థాయిల్లో ఉండాలన్నారు. జాతీయస్థాయిలో ఏర్పడే కమీషన్ కు రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు మరియు మహిళా జర్నలిస్ట్ ,ఇతర ప్రముఖులతో ఉండాలన్నారు. అదే విదంగా రాష్ట్ర స్థాయిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి , రిటైర్డ్ హైకోర్ట ప్రధాన న్యాయమూర్తి జిల్లా స్థాయిలో రిటైర్డ్ జిల్లా జడ్జి తో కమీషన్ ఏర్పాడాలన్నారు. జర్నలిస్ట్. లకు ఉద్యోగ భద్రతతోపాటు, సంక్షేమ పథకాలు అందించాల్సిన బాద్యత పాలకులపై ఉందన్నారు. వేతనసంఘ సిఫార్సులు అమలుకు నోచుకోవడం లేదని తాను దీనికోసం ఢిల్లీ కోర్టులో వాదించిన కేసు గురించి వివరించారు. ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి అద్యక్షత వహించిన ఈ సెమినార్ లో అమోద్ కె ఖాన్ , ఎస్ ఎన్ సిన్హా, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఏపీ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ , సీనియర్ జర్నలిస్టుల మధుర్, అవినాష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

26 వేల సభ్యత్వంకలిగి 26 రాష్షాలలో నిర్మాణంలో కలిగి దేశంలో అతి పెద్ద సంఘంగా ఐజేయూ నిలవడం గర్వకారణంగా ఉందని ఐజేయూ అద్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.. సెమినార్ కు 16 రాష్ట్రాల ప్రతినిధులు, ఢిల్లీ మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు .

Related posts

ఎట్టకేలకు ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిన తెలంగాణ…

Drukpadam

విరాట్ కోహ్లీ నిర్ణయం షాకింగ్: రోహిత్ శర్మ

Drukpadam

తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల.. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్..!

Drukpadam

Leave a Comment