Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పడిపోతోంది… మంత్రి జగదీశ్ రెడ్డి….

దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పడిపోతోంది… మంత్రి జగదీశ్ రెడ్డి
-బీజేపీని నమ్ముకున్న వాళ్లకు ఒరిగేదేమీ లేదు:
-ఈటల బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు
-స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి
-ఈటలకు ప్రయోజనం ఉండదని వెల్లడి
-ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లడం సహజమని వ్యాఖ్యలు

ఇటీవల మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈటల బీజేపీలోకి వెళ్లడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పడిపోవడం వల్ల బీజేపీని నమ్ముకున్నవాళ్లకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అన్నారు.

రాజకీయ పార్టీల్లో అనుకున్న స్థానం దక్కని వాళ్లు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లడం సహజమని జగదీశ్ రెడ్డి వివరించారు. తెలంగాణలో బీజేపీకి ప్రాబల్యం ఉండదని తాను ముందే చెప్పానని స్పష్టం చేశారు. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలిపారు.

Related posts

కేసీఆర్ ను ఉద్దేశించి ఈటల లేఖ … ఇది తప్పుడు ప్రచారం అంటున్న ఈటల మద్దతు దార్లు…

Drukpadam

ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రేసులో న‌ఖ్వీ? కేంద్రమంత్రి పదవికి రాజీనామా!

Drukpadam

టీఆర్ యస్ ,బీజేపీ డ్రామాలతో రాష్ట్రానికి దక్కకుండా పోయిన ఆయుష్ వైద్య కేంద్రం…ఆరెస్పీ!

Drukpadam

Leave a Comment