Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

బరువు తగ్గాలనుకునే వారికి.. జామాకులతో మంచి ఫలితం

  • కార్బోహైడ్రేట్స్ ను చక్కెరగా మారకుండా చూసే రక్షణ వ్యవస్థ
  • రోజూ తీసుకుంటే కేన్సర్ రిస్క్ తగుతుంది
  • వ్యాధినిరోధక శక్తి బలోపేతం

జామకాయలు తినడానికి రుచిగా ఉంటాయి. కానీ, జామాకులు వగరు, చేదుగా ఉంటాయి. రుచి ఎలా ఉన్నా, జామాకులను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి.  

  • కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చక్కెరలుగా మారకుండా జామాకులు చూస్తాయి. దీంతో బరువు తగ్గుతారు. రోజువారీ జామాకుల రసం లేదంటే జామాకులతో టీ పెట్టుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • జామాకుల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. లైకోపీన్ కేన్సర్ రిస్క్ ను గణనీయంగా తగ్గిస్తుందని పలు అధ్యయనాలు చెప్పాయి.
  • జామాకుల్లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. కనుక దీని రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది.
  • జామాకులను నీటిలో కాచిన తర్వాత, ఆ రసాన్ని తల వెంట్రుకల కుదుళ్లకు పట్టించాలి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరిగేందుకు దారితీస్తాయి. 
  • ప్రతి రోజూ జామాకులను నీటిలో కాచి, తాగితే వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. పలు వ్యాధులు వచ్చే రిస్క్ ను తగ్గించేస్తుంది. 
  • మధుమేహ నియంత్రణ, రక్షణ వ్యవస్థ జామాకుల్లో ఉంది. 
  • జామాకుల రసం తాగితే రక్తపోటు తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది (ఎల్ డీఎల్). మంచి కొలెస్ట్రాల్ (హెచ్ డీఎల్) పెరుగుతుంది.

Related posts

జీరా వాటర్​, ధనియా వాటర్​… బరువు తగ్గేందుకు ఏది బెస్ట్​?

Ram Narayana

కార్డియాక్ అరెస్ట్ ముప్పును ముందే చెప్పే సంకేతాలివే.. అమెరికా తాజా అధ్యయనం

Ram Narayana

ఈ లక్షణాలు కనిపిస్తే…మధుమేహం ముసురుకుంటున్నట్టే!

Ram Narayana

Leave a Comment