స్వరాష్ట్రం కోసం పోరాడం, దెబ్బలు తిన్నాం, జైళ్ళకెళ్ళాం మమ్మలను ఆదుకోండి…తెలంగాణ ఉద్యమకారులు …
నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వండి …ఇళ్లస్థలు ,ఇంటి నిర్మానికికి 10 లక్షలు ఇవ్వాలి
ఉయమంలో పాల్గొని చదువులు నష్టపోయిన విద్యార్థులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలి
ఉద్యమకారుల డిమాండ్లను బీఆర్ ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చాలి….
రేపటి నుండి ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేత…
మీడియా సమావేశంలో బీఆర్ ఎస్ ఉద్యమకారులు.
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో పెళ్ళాం పిల్లలని పట్టించుకోకుండా , నిత్యం ఉద్యమంలో పాల్గొన్నాం … నాడు అనేకమంది ఎగతాళి చేసినా, జేబులో జెండాలు పెట్టుకొని మెరుపు ఉద్యమాలు చేశాం …అనేక కేసులు లాఠీదెబ్బలు తిన్నాం … జైళ్లకు వెళ్లి కేసులు పాలైనా బంగారు తెలంగాణ లో కేసీఆర్ బాటలో నడుస్తున్నామని, తమ డిమాండ్లను పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చాలని ఉద్యమకారులు కోరారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యమకారులకు నామినేటెడ్, పార్టీ పదవుల్లో అవకాశం కల్పించాలని, కేసులు అనుభవించి, జైలు జీవితం గడిపిన ప్రతి ఉద్యమకారుడికి పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యకారుడికి 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం చేయాలని కోరారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం వాటా కేటాయించాలని , అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేసారు.
ఈ సమావేశంలో బీఆర్ ఎస్పార్టీ వ్యవస్థాపక సభ్యులు పగడాల నరేందర్, బీఆర్ ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రడం సురేష్ గౌడ్, బీఆర్ ఎస్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు లింగనబోయిన సతీష్ ,యువజన విభాగం రాష్ట్ర నాయకులు నందిగామ రాజ్ కుమార్, బీఆర్ ఎస్ కొత్తగూడెం మాజీ మండల అధ్యక్షుడు ఎండి హుస్సేన్,ఖమ్మం నియోజకవర్గం యువజన విభాగం మాజీ అధ్యక్షుడు కోడి రెక్క ఉమా శంకర్, ఉద్యమ కారుడు దరిపల్లి వీరబాబు, ఉద్యమ గాయకుడు పమ్మి రవి,, తెలంగాణ ఉద్యమకారుడు చల్లపల్లి అజయ్ చారి తదితరులు పాల్గొన్నారు.