Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేటీఆర్ తన ఫ్రెండ్‌కు టిక్కెట్ ఇచ్చారు, ఎలా గెలుస్తారో చూస్తా: రేఖానాయక్ కంటతడి

  • బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రేఖా నాయక్
  • బీఆర్ఎస్‌లో మహిళలకు గౌరవం లేదన్న ఎమ్మెల్యే
  • ఏ పార్టీ తరఫున పోటీ చేసేది త్వరలో వెల్లడిస్తానన్న రేఖానాయక్
  • నన్ను ఏడిపించారు.. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏడిపిస్తానన్న ఎమ్మెల్యే

 బీఆర్ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే రేఖా నాయక్ శుక్రవారం ప్రకటించారు. బీఆర్ఎస్‌లో మహిళలకు గౌరవం లేదని ఆమె మండిపడ్డారు. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేసేది త్వరలో ప్రకటిస్తానన్నారు. మంత్రి కేటీఆర్ తన స్నేహితుడికి ఖానాపూర్ టిక్కెట్ ఇచ్చారన్నారు. తాను ఏం తప్పు చేశాను? కుంభకోణాలకు పాల్పడ్డానా? టిక్కెట్ ఎందుకు నిరాకరించారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చిన జాన్సన్ ఎస్టీ కానే కాదన్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తన నియోజకవర్గానికి నిధులు ఆపేశారన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో నేనూ చూస్తానంటూ సవాల్ చేశారు. తాను పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. అధికార పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. తనకు అనవసరంగా టిక్కెట్ నిరాకరించారంటూ రేఖా నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇప్పుడు ఏడుస్తున్నానని, కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏడిపించడం ఖాయమన్నారు.

Related posts

ఆశించిన వారందరికీ టిక్కెట్ ఇవ్వలేం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Ram Narayana

కేసీఆర్‌ను గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌లో చేరాను: వివేక్

Ram Narayana

సోనియా, రాహుల్ గాంధీలతో షర్మిల కీలక భేటీ…కాంగ్రెస్ లో చేరిక లాంఛనమే …!

Ram Narayana

Leave a Comment