తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఇల్లందు ,కొత్తగూడెం ఇంచార్జి ఎంపీ వద్దిరాజు ఆపరేషన్ సక్సెస్ …

తిరిగి గులాబీ గూటికి మడత వెంకట్ గౌడ్ …కండువాకప్పి కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
వద్దిరాజు ఆపరేషన్ సక్సెస్ …
కేటీఆర్ ని కలిసిన బిఆర్ఎస్ నేత కాసుల వెంకట్ ..వద్దిరాజు చొరవతో అలక వీడిన వెంకట్ ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ మాజీ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ కు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.మహబూబాబాద్ జిల్లా తొర్రురు లో సోమవారం సాయంత్రం జరిగిన సభలో పాల్గొనేందుకు వచ్చిన కేటీఆర్,మడత వెంకట్ గౌడ్ ను పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,ఎంపీ మాలోతు కవిత,ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ ని కలిసిన బిఆర్ఎస్ నేత కాసుల వెంకట్

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కొత్తగూడెం నియోజకవర్గ సీనియర్ బిఆర్ఎస్ నేత కాసుల వెంకట్ మర్యాదపూర్వకంగా కలిశారు
మహబూబాబాద్ జిల్లా తొర్రురు బిఆర్ఎస్ సభకు వచ్చిన కేటీఆర్ ని రాజ్య సభ సభ్యులు కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో కలిసిన వెంకట్ ను బిఆర్ ఎస్ అభ్యర్థి వనమా విజయానికి కృషి చేయాలని ఈ సదర్భంగా కేటీఆర్ కోరారు
ఎంపీ రవిచంద్ర దిశా నిర్దేశనంలో
కొత్తగూడెంలో పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీ తో గెలిపించుకుని పార్టీ అధినేత కేసీఆర్ కి బహుమతిగా ఇస్తామని కాసుల వెంకట్ పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ కవిత ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొత్తగూడెం బిఆర్ఎస్ యువజన నేత కాసుల సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

ఎంపీపై దాడితో చిల్లర రాజకీయమా?: కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్

Ram Narayana

మరో రెండేళ్లలో కేసీఆరే సీఎం…. హరీశ్ రావు

Ram Narayana

నేను పదవుల రేసులో లేను… ముఖ్యమంత్రి పదవి నా వద్దకు వస్తుంది!: జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana