Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

పాలేరులో పొంగులేటి …ఖమ్మంలో తుమ్మల పోటీ ఖరారు ….!

పాలేరులో పొంగులేటి …ఖమ్మంలో తుమ్మల పోటీ ఖరారు ….!
అధిష్టానం ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం ..
కామ్రేడ్స్ తో పొత్తులపై జరుగుతున్న చర్చలు
హైద్రాబాద్ లో తుమ్మల …పొంగులేటి భేటీ
జిల్లాలో ఎన్నికల ప్రచారం పై సుదీర్ఘ చర్చ
అన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు నేతలు కలిసి తిరగాలని నిర్ణయం ..

కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నికల కసరత్తు చివరదశలో ఉన్నట్లు సమాచారం …ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ సీట్లలో పాలేరు నుంచి మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఖమ్మం నుంచి మాజీమంత్రి తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు పోటీ ఖాయమని విశ్వసనీయసమాచారం …మొదట్లో తుమ్మల పాలేరు పై పట్టు బట్టినప్పటికీ నియోజకవర్గాల్లో ఉన్న పరిణామాలు ,సామజిక సమీకరణాల నేపథ్యంలో తుమ్మల ఖమ్మం , పొంగులేటి పాలేరు నుంచి పోటీచేసేందుకు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం .అధిష్టానం పెద్దలు సైతం ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిపి ఒప్పించినట్లు తెలుస్తుంది. దీంతో ఎన్నికల రసవత్తరంగా మారె అవకాశాలు ఉన్నాయి. బలమైన నేతలుగా ఉన్న ఇద్దరినీ అకామిడేట్ చేయడంతో ఇక మిగతా నియోజకవర్గాల విషయంపై ద్రుష్టి సారించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు .

తుమ్మల …పొంగులేటి భేటీ … జిల్లాలో కలిసి కట్టుగా ప్రచారం ..

కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు నేతలు సోమవారం హైద్రాబాద్ లో భేటీ అయ్యారు . జిల్లాలో ఉన్న పరిస్థితులు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన ఆవశ్యకత పై సుదీర్ఘ చర్చలు జరిపారు .జిల్లాలో ఇద్దరు నేతలు కలిసి కట్టుగా ప్రచారం చేయాలనీ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం జిల్లాకే చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , రేణుక చౌదరి సహకారం తీసుకోని జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం …10 కి 10 సీట్లు గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేయాలనీ వారు నిర్ణయించుకున్నారు .జిల్లాలో ప్రియాంక పర్యటనతోపాటు , రాహుల్ గాంధీ సభ కూడా ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు . ఎన్నికల షడ్యూల్ ప్రకటించినందున కాంగ్రెస్ సత్తా చాటేలా ప్రణాళికలు రూపొందించి దూకుడుగా వెళ్లాలని ఇప్పటికే అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు నిర్ణయించుకున్నారు …కొత్తగూడెం,భద్రాచలం సీట్లను సిపిఐ, సిపిఎం కి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో అవి చర్చలు దశలోనే ఉన్నాయని తెలుస్తుంది…అయితే లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రయాణం చేయాలనీ అధిష్టానం సైతం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది….

Related posts

మంత్రి కొండా సురేఖ వర్సెస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి

Ram Narayana

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి, అధికారం ఖాయం… సీఎల్పీ నేత భట్టి !

Ram Narayana

కేసీఆర్ రహస్య భేటీని బయట పెట్టి విరుకున పెట్టిన ప్రధాని మోడీ …

Ram Narayana

Leave a Comment