సినిమా వార్తలు

పుట్టిన రోజున బిగ్‌బీని చూసి అభిమానుల్లో సంబరం

  • నేడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు
  • నటశిఖరాన్ని చూసేందుకు ఆయన ఇంటివద్ద భారీగా జనసందోహం
  • ఇంటి నుంచి బయటకు వచ్చి బిగ్‌బీ అభివాదం
  • బిగ్‌బీ సర్‌ప్రైజ్‌తో మిన్నంటిన అభిమానుల సంబరం
Amitabh Bachchan turns 81 The actor surprises fans and greets them as they gather outside his house on his birthday

నేడు బాలీవుడ్ లెజెండ్ బిగ్‌బీ పుట్టిన రోజు..అంటే ఆయన అభిమానులకు పండుగ రోజు. దీంతో, ముంబైలోని బిగ్‌బీ నివాసం జల్సా వద్దకు అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. కేక్‌లు, ఇతర బహుమతులతో గేటు వద్ద ఎదురు చూస్తున్న అభిమానులకు బిగ్‌బీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంటి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ప్రతి ఆదివారం తన నివాసం వద్ద అభిమానులను కలుసుకునే బిగ్‌బీ నేడు పుట్టినరోజు కావడంతో మరోసారి వారితో కలిసి తన సంతోషాన్ని పంచుకున్నారు. 

కాగా, అమితాబ్ తన అభిమానులను కలిసేందుకు ఎప్పుడూ చెప్పులు లేకుండానే బయటకు వస్తారు. ఈ విషయమై ఆయన ఇటీవల నెట్టింట క్లారిటీ ఇచ్చారు. ‘‘అభిమానులను కలుసుకునేందుకు చెప్పులు లేకుండా రావాలా? అని నన్ను జనాలు తరచూ అడుగుతుంటారు. నేను గుడికి వెళ్లినప్పుడు చెప్పులు లేకుండానే వెళతాను. అలాగే, అభిమానులను చూసేందుకూ ఉత్తకాళ్లతో వస్తాను. అభిమానుల సమక్షమే నాకు దేవాలయం’’ అని ఆయన స్పష్టం చేశారు. 

ఇక తాజాగా 81వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన బిగ్‌బీ ఈ వయసులో కూడా యువకులతో సమానంగా బిజీ లైఫ్ గడుపుతుంటారు. ప్రస్తుతం కౌన్‌‌బనేగా కరోడ్ పతి షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన.. టైగర్ ష్రాఫ్, కృతి సనన్ జంటగా నటిస్తున్న గణ్‌పత్ పార్ట్ వన్ లోనూ తళుక్కుమననున్నారు.

Related posts

ఆర్జీవీ తలకు రూ. కోటి నజరానా.. టీవీ లైవ్ లో కొలికపూడి వ్యాఖ్యలు.. వర్మ పోలీస్ కంప్లైంట్

Ram Narayana

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అలీ స్పందన

Ram Narayana

అలనాటి నటి ముచ్చర్ల అరుణ ఇంట్లో ఈడీ

Ram Narayana