Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

నర్సు స్నానం చేస్తుండగా వీడియో తీసిన పోలీసు

  • ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో ఘటన 
  • తను స్నానం చేస్తుండగా పోలీసు కానిస్టేబుల్ రికార్డు చేశాడని నర్సు ఆరోపణ
  • నిందితుడిని గుర్తించి కెమెరా ఇవ్వమంటే పారిపోయినట్టు వెల్లడి
  • పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

ఉత్తర‌ప్రదేశ్‌ మొరాదాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తాను స్నానం చేస్తుంటే ఓ పోలీసు కానిస్టేబుల్ తనను రహస్యంగా ఫోన్‌తో రికార్డు చేశాడంటూ ఓ నర్సు సంచలన ఆరోపణ చేసింది. అక్టోబర్ 10న ఈ ఘటన జరిగింది. బాధితురాలు మొరాదాబాద్‌లోని జిల్లా ఆసుపత్రిలో నర్సుగా చేస్తోంది. 

నిందితుడు తన పొరుగింట్లో ఉంటాడని, అతడు తన సహోద్యోగి భర్తే అని ఆమె చెప్పింది. ఆ రోజు ఉదయం తాను స్నానం చేసి దుస్తులు ధరిస్తూ పైకి చూడగా ఓ కెమెరా కనిపించిందని చెప్పింది. వెంటనే తాను బాత్రూమ్ బయటకు వచ్చి చూడగా పొరుగింటికి లోపలి నుంచి గొళ్లెం పెట్టి ఉందని చెప్పింది. అక్కడే ఉన్న ఓ మహిళను తలుపులు తెరవమని చెప్పి లోపలికి వెళ్లి చూడగా నిందితుడు కనిపించాడని పేర్కొంది. తాను అతడిని సెల్‌ఫోన్ చూపించమని కోరగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని చెప్పింది. ఆ వెంటనే ఆమె సివిల్ పోలీస్ లైన్స్‌లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది.

Related posts

కరోనా వ్యాక్సిన్ అంటూ కళ్లలో చుక్కలు వేసి బంగారు గొలుసు చోరీ!

Drukpadam

హైద్రాబాద్ చైతన్య కాలేజీలో మరో విద్యార్ధి బాలి …వేధింపులే కారణమంటున్న తోటి విద్యార్థులు …

Drukpadam

బస్సు నుంచి రూ. 3 కోట్ల విలువైన బంగారు నగల చోరీ..!

Ram Narayana

Leave a Comment