Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్కోర్ట్ తీర్పులు

కోర్టు హాలులో చంద్రబాబు, సీఐడీ న్యాయవాదుల మధ్య మాటల యుద్ధం.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి!

కోర్టు హాలులో చంద్రబాబు, సీఐడీ న్యాయవాదుల మధ్య మాటల యుద్ధం.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి!
చంద్రబాబు పై వార్తలు రాయవద్దని గాగ్ ఆర్డర్ కోసం ఆయన లాయర్ల పట్టు
కాల్ డేటా రికార్డులపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్
సీఐడీ తరఫున వాదనలు వినిపించిన వివేకానంద
ఈ క్రమంలో ఇరువైపుల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం

ఏసీబీ న్యాయస్థానంలో చంద్రబాబు న్యాయవాదులు, సీఐడీ న్యాయవాదుల మధ్య గురువారం తీవ్రవాగ్వాదం తలెత్తింది. కాల్ డేటా రికార్డులపై విచారణ సందర్భంగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఇరువైపుల న్యాయవాదుల మధ్య వాదన పెరిగి ఉద్రిక్తత తలెత్తింది. దీంతో అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌లో ఉన్నవారు మినహా అందరూ హాలు నుంచి వెళ్లిపోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాదుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే విచారణ కష్టమని బెంచ్ దిగి వెళ్లిపోయారు. చంద్రబాబు తరుపు లాయర్లు బాబుపై ఎలాంటి వార్తలు రాకుండా గాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోర్ట్ ను కోరారు … దీనిపై కూడా లాయర్ల మధ్య మాటామాటా పెరిగినట్లు తెలుస్తుంది…

సీఐడీ అధికారుల కాల్ డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ రోజు ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషన్ వేసి నెల రోజులైందని, త్వరగా విచారించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు. అసలు ఈ పిటిషన్ అనర్హమైనదని సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద వాదించారు. ఈ క్రమంలో ఇరువైపుల న్యాయవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టులో ఇరు పక్షాల లాయర్లు చర్యలను తప్పు పడుతున్నారు న్యాయకోవిదులు …కోర్టులో కక్షిదారులు తరుపున వాదించడం న్యాయవాది వృత్తి అంతమాత్రాన శత్రువైఖరితో వ్యవహరించకూడదని అంటున్నారు . కోర్ట్ హాల్ లో ఒక్కొక్కప్పుడు గట్టిగ వాదించుకుంటాం అది చట్ట ప్రకారం ఉంటుంది తప్ప చట్టానికి అతీతంగా ఎవరు వ్యవహరించడం సరికాదు అని అంటున్నారు న్యాయనిపుణులు …

Related posts

సీఎల్పీ నేత భట్టికి మంద కృష్ణ థాంక్స్!

Drukpadam

బెలారస్ లో రష్యా అణ్వాయుధాల పార్కింగ్.. !

Drukpadam

Here Are 5 Ways You Can Get Younger-looking Skin Right Now

Drukpadam

Leave a Comment