Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తమిళనాడు సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం…

కరోనా వల్ల అనాథలుగా మారిన పిల్లలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం: స్టాలిన్
-తల్లిదండ్రుల్లో ఒక్కరిని పోగొట్టుకుంటే వారికి మూడు లక్షలు
-ఈ మొత్తాన్ని ఫిక్సుడు డిపాజిట్ చేస్తాం
-డిగ్రీ పూర్తయ్యేంత వరకు బాధ్యత ప్రభుత్వానిదే
-హాస్టళ్లలో ఉండని వారికి నెలకు రూ. 3 వేలు ఇస్తాం

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నీ సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా అనాథలుగా మిగిలిపోయిన చిన్నారులను ఆదుకునేందుకు ఆయన ముందుకొచ్చారు.

అలాంటి పిల్లలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తాన్ని అనాథ పిల్లల పేరిట ఫిక్సుడు డిపాజిట్ చేస్తామని… వారికి 18 ఏళ్లు నిండిన తర్వాత వడ్డీతో సహా, మొత్తం డబ్బును తీసుకోవచ్చని తెలిపారు. తల్లిదండ్రుల్లో ఎవరినో ఒకరిని కోల్పోయిన వారికి రూ. 3 లక్షల సాయం చేస్తామని చెప్పారు.

అనాథలైన చిన్నారుల సంరక్షణ, చదువు బాధ్యతలను కూడా తమ ప్రభుత్వమే తీసుకుంటుందని స్టాలిన్ చెప్పారు. డిగ్రీ పూర్తయ్యేంత వరకు అన్ని ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో వారికి వసతి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒకవేళ హాస్టళ్లలో కాకుండా బంధువుల ఇళ్లలో ఉండేవారికి ప్రతి నెలా రూ. 3,000 సాయం అందజేస్తామని వెల్లడించారు. అనాథలైన పిల్లల మంచిచెడ్డలు చూసుకునేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Related posts

ఎన్ఠీఆర్ ట్రస్ట్ కరోనా సేవలు భేష్…

Drukpadam

కరోనా కట్టడికి గులేరియా సూచనలు

Drukpadam

కరోనా  వైరస్ చైనా తయారు చేసిన జీవాయుధమే.. ఆస్ట్రేలియా పత్రిక సంచలన కథనం

Drukpadam

Leave a Comment