Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు, కుటుంబసభ్యుల ఆందోళన…

చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు, కుటుంబసభ్యుల ఆందోళన….
చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న లోకేశ్
ఆయనకు తక్షణ ముప్పు పొంచి ఉందని ఆవేదన
చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక
చంద్రబాబు ప్రాణానికి హాని తలపెడుతున్నారు: అచ్చెన్నాయుడు
చంద్రబాబు ఐదు కిలోల బరువు తగ్గారు: భువనేశ్వరి
ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందని ఆవేదన
చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత: యనమల హెచ్చరిక
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని డిమాండ్
చంద్రబాబు నాయుడి గారికి అత్యవసర వైద్యం అవసరం: నారా బ్రాహ్మణి
అపరిశుభ్ర, వసతుల్లేమి మధ్య చంద్రబాబుగారిని నిర్బంధించడంపై ఆందోళన

జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేయగా, తాజాగా కుమారుడు నారా లోకేశ్ కూడా ఆందోళన చెందుతూ ఎక్స్ ద్వారా ఆవేదన పంచుకున్నారు.

చంద్రబాబు భద్రత నిస్సందేహంగా ప్రమాదంలో పడిందని, ఉద్దేశపూర్వకంగా ఆయనకు హాని తలపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తక్షణ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. జైలు గదిలో దోమలు, కలుషిత నీరు ఉన్నాయని, బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, అలెర్జీలతో ఆయన బాధపడుతున్నారని, సకాలంలో వైద్యసాయం అందడం లేదని పేర్కొన్నారు.

చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, అధికార యంత్రాంగం ఏం దాచేందుకు ప్రయత్నిస్తోందని లోకేశ్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే అందుకు వైఎస్ జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారని చెప్పారు. స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకు ఏసీ అవసరమని తెలిపారు. వేడి ఉష్ణోగ్రతను ఆయన తట్టుకోలేరని అన్నారు. ఆయన స్నానం చేయడానికి వేడి నీళ్లు కూడా ఇవ్వడం లేదని చెప్పారు.

చంద్రబాబుకు ప్రాణహాని తలపెడుతున్నారు …అచ్చెన్నాయుడు

జైల్లో చంద్రబాబుకు ఇతర మందులు ఇస్తూ ప్రాణానికి హాని తలపెడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నెల రోజుల్లో చంద్రబాబు ఏకంగా 5 కేజీల బరువు తగ్గారని.. ఈ స్థాయిలో బరువు తగ్గడం ప్రమాదకరమని డాక్టర్లు చెపుతున్నారని అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వచ్చిన తర్వాత ఒక వైద్య బృందాన్ని జైలుకు పంపించారని… ఆ డాక్టర్లు వాస్తవ రిపోర్టును రాయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ఆయన వ్యక్తిగత వైద్యుల చేత టెస్ట్ లు చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని గమనించాలని కోర్టులను కోరుతున్నామని చెప్పారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని అన్నారు.

తన భర్త ఆరోగ్యానికి ముప్పు …భువనేశ్వరి

తన భర్త చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నాయని భువనేశ్వరి ఎక్స్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం అందించాలి …యనమల

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

చంద్రబాబుకు తక్షణం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం అందించాలని కోరారు. ఆయనకు పూర్తిస్థాయిలో వైద్యం చేయడంతోపాటు సరైన వైద్యం అందించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

అపరిశుభ్రమైన కారాగారంలో చంద్రబాబు ఉన్నారు ….

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల, ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు డీహైడ్రేషన్ తో బాధపడుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, నారా బ్రాహ్మణి నేడు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.

‘‘గుండె తరుక్కుపోతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం తగిన సదుపాయాల్లేని, అపరిశుభ్ర కారాగార పరిస్థితుల మధ్య నిర్బంధంలో ఉన్నారు. అది ఆయన ఆరోగ్యానికి ఆందోళనకర రిస్క్ ను తీసుకొస్తుంది. వైద్య నిపుణులు ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళనలు వ్యక్తం చేసినందున అత్యవసర వైద్య పర్యవేక్షణ అవసరం ఇప్పుడు ఏర్పడింది. సకాలంలో వైద్య సంరక్షణ అందించడం లేదు. ఆయన 5 కిలోల మేర బరువు తగ్గారు. మరింత బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. ఆయన ఆందోళన గురించి మేము ఎంతో ఆందోళన చెందుతున్నాం’’ అని బ్రాహ్మణి తన పోస్ట్ లో పేర్కొన్నారు….

Related posts

మంగళగిరిలో జగన్ రోడ్ షో..భారీగా తరలి వచ్చిన జనం …!

Ram Narayana

నాగబాబుకు మంత్రి పదవి …

Ram Narayana

మాచ‌ర్ల‌లో వైసీపీకి ఎదురుదెబ్బ‌!

Ram Narayana

Leave a Comment