Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్ నుంచి వెళ్తుండగా వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం!

  • కారు డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో ఢీకొన్న కార్లు
  • దెబ్బతిన్న కారు వెనుక భాగం
  • ఫోన్ చేసి వివరాలు అడిగిన జగన్, షర్మిల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మికి ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆమె కారులో ఒంగోలుకు బయల్దేరారు. మార్గమధ్యంలో సంతమాగులూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక వేగంగా వస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది. అయితే ఈ ఘటనలో విజయమ్మకు, కారులో ప్రయాణిస్తున్న ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అదే కారులో ఆమె ఒంగోలుకు చేరుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న తనయుడు జగన్, కూతురు షర్మిల ఆమెకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

Related posts

సాగర్ డ్యాంపై తెలుగు రాష్ట్రాల ఢీ ..కేంద్రం హోమ్ శాఖ జోక్యం సద్దు మణిగిన వివాదం

Ram Narayana

షర్మిలకు ఏఐసీసీలో కీలక భాద్యతలు అప్పగించనున్నారా…?

Ram Narayana

కోడిపందేల్లో చేతులు మారుతున్న వందల కోట్లు …

Ram Narayana

Leave a Comment